గుప్పెండమతమనసు ఎపిసోడ్ 321: వసూ టైం ఆగయా..గౌతమ్ తో కలిసి రిషీ మీదే సైటర్లు వేసిన వసుధార..!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ఆరోజు రాత్రి రిషీ వసూ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ..ఉదయం రెస్టారెంట్ లో జరిగింది తలుచుకుంటూ ఉంటాడు. తన సారీల కోసం నేను వెయిట్ చేయటం ఎందుకు నేనే ఫోన్ చేసి క్లాస్ ఇస్తాను అని కాల్ చేస్తాడు. జగతి ముందే వసూ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసిందిగా..ఫోన్ చేసి తిడతాననని తెలిసి..స్విచ్ఛ్ ఆఫ్ చేసినట్లు ఉంది..ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు అనుకుంటాడు.
తెల్లారుతుంది. వసూ, పుష్పా కాలేజ్ కి వస్తూ ఉంటారు. పుష్పా ఏం మాట్లాడినా వసూ సమాధానం ఇవ్వదు. ఎదురుగా రిషీ ఉంటాడు. రిషీ ఒక్కసారి నా క్యాబిన్ లోకి రా అని వెళ్తాడు. పుష్పా రిషీ సార్ కోపంగా కనపిస్తున్నారు కదా అంటే..ఆయనగారు కోపంగా ఎప్పుడు లేరు చెప్పు అంటుంది. అది రిషీ వింటాడు. వచ్చేప్పుడు క్యాబిన్ కి జగతి మేడమ్ ని కూడా తీసుకురా అంటాడు. వసూ మనసులో క్యాబిన్ కి రమ్మన్నారంటే..నిన్న జరిగిందానికి ఇప్పుడు విచారణ మొదలుపెడతారేమో అనుకుంటాడు. కట్ చేస్తే..గౌతమ్ ఓ రేంజ్ లో కాలేజ్ కి ఎంట్రీ ఇస్తాడు. అక్కడున్న పూలమొక్కలు చూసి ఒక పూవు కోయబోతాడు. ఇంతలో అంటెండర్ వచ్చి ఇక్కడ పూలు తెంపకూడదు అంటాడు. సరే అని మీ ఎండీగారి క్యాబిన్ ఎక్కడ అని అటెండర్ కలిసి వెళ్తాడు.
మరోపక్క వసూ రిషీ రమ్మన్నది జగతి, మహేంద్రకు చెప్తుంది. వసూ మీరు ఉండండి మేడమ్..నేను వెళ్తాను అంటుంది. జగతి గొడవపడతావా అంటే..తిట్టడానికి ఆయన సిద్దంగా ఉంటే..ఎదుర్కోవాలి అంతే అని. ఆయన విన్నా వినకున్నా నేను చెప్పే వస్తాను అని వెళ్తుంది. గౌతమ్ గోస్ట్ మాస్క్ వేసుకుని రిషీని భయపెడదామనుకుంటాడు. కానీ మనోడు కనిపెట్టి గౌతమ్ రారా ఇడియట్ అంటాడు. దీన్ని బట్టి వీళ్లు క్లోస్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ..రిషీకోసం ఉన్న కాఫీ తాగి..ఈ కాఫీ నాకు రాసిపెట్టిఉంది నేను తాగాలి అని తాగుతాడు. అలా మాట్లాడుకుంటూ..రిషీ ఉంటావా వెళ్తావా అంటే..సరదాగా కొన్నిరోజులు ఉండి వెళ్దాం అని వచ్చాను కానీ ఒక యాక్సిడెంట్ నన్ను ఉండేలా చేసింది అని నిన్న జరిగిన యాక్సిడెంట్ గురించి వసూ గురించి చెప్తాడు. ఆ అమ్మాయి ఉంది..మామూలుగా లేదురా అంటాడు. నువ్వు ఇంకా మారలేదురా అని రిషీ..ఈ అమ్మాయి అందరిలాంటిది కాదురా, తన మనసు చాలా మంచిదిరా, తన లుక్స్ లో కాన్ఫిడెన్స్ ఉందిరా, ధైర్యం ఉన్నఅమ్మాయి, తన చిరునవ్వు ఉందిరా..కవితలు కాదు, కావ్యంరాసేయొచ్చు..ఆ అమ్మాయికోసం ఉంటాను అని గౌతమ్ అంటే..నీ సంగతి నాకు తెలియదా, ప్రతిసారి ఇలానే అంటావ్ అంటాడు. గౌతమ్ నేను ఈ అమ్మాయిని సీరియస్ గా తీసుకున్నాను..నువ్వు హెల్ప్ చేయాలిరా అంటే..ఆ అమ్మాయి నీకురాసిపెట్టి ఉంటే నీకే దక్కుతుంది అంటాడు. దూరం నుంచి వసూరావటం చూసి అటెండర్ అరగంట వరకూ ఎవర్నీ పంపొద్దు అంటాడు. అదే విషయం వసూకి అటెండర్ చెప్తాడు. కావాలనే నన్ను వెనక్కు పంపిస్తున్నారేమో అనుకని వసూ వెనక్కు వెళ్తుంది.
నీ టూర్ ప్లానింగ్స్ ఏంట్రా అని రిషీ అంటే..వచ్చేటప్పుడు ఎన్నో అనుకున్నాను.. కానీ ఆ అమ్మాయిని పట్టుకోవటం నా ప్లాన్ అంటాడు. వసూ జగతి వాళ్ల దగ్గరకు వస్తుంది. ఏంటి వసూ ఏమైంది అని జగతి అడుగుతుంది..కావాలనే పిలిపించి వెనక్కు పంపిచారు, ఇలా రెండు మూడు సార్లు పిలిపించి కక్షసాధించుకుంటున్నారేమో అంటుంది వసూ. రిషీ అలాంటి వాడు కాదు..నిజంగానే బిజీగా ఉన్నారేమో అంటుంది జగతి. ఎన్ని జరిగినా మీరు రిషీ సార్ నే సపోర్ట్ చేస్తారు మేడమ్ .. నా వల్ల కాదు మేడమ్..నేను అలా ఆలోచించలేను..నిజాన్ని నిర్భయంగా చర్చించాలి మేడమ్ అంటుంది వసూ. జగతి రిషీకి నువ్వైనా చెప్పు మహేంద్ర, దేవయాని అక్కయ్య మా మీద కక్షసాధించుకుంటుంది అంటుంది. మహేంద్ర నువ్వే చెప్పు వసూ అంటాడు. ఏంటి మహేంద్ర నువ్వు నేను నిన్ను చెప్పమంటండే..వసూ దేవయాని అక్కయ్య చెప్పిన అబద్దాలు మాత్రమే చెప్పాలని కానీ..అన్నీ విషయాలు చెప్పాలని ట్రై చేయకు అంటుంది జగతి. అలా వాళ్లు మాట్లుడుకుని..పద వసూ నేను నిన్ను రెస్టారెంట్ లో డ్రాప్ చేస్తాను అంటే..లైబ్రరీలో నాకు కొంచెం పనుంది మీరు వెళ్లండి అంటుంది వసూ.
మరోసీన్ లో రిషీ, గౌతమ్ కలిసి కారులో వస్తుంటారు. గౌతమ్ ఆ అమ్మాయి కనిపించినప్పుడు నుంచి నా మనసు అంతా తన ఆలోచనలేరా..కళ్లు మూస్తే తన ముఖమే గుర్తుకువస్తుది. డాక్టర్ కు చూపించుకో ఏం మాయదారిరోగమో అంటాడు రిషీ. రోగమే కానీ బాడీకి కాదు..మనసుకురా..గుండెచప్పుడు మారిపోయిందిరా..ఆ అమ్మాయి మళ్లీ కనిపిస్తుందంటావా అని గౌతమ్ అంటే..నువ్వు మళ్లీ కావాలని రాసిపెట్టి ఉంటే తప్పుకుండా కలుస్తుందిరా అంటాడు రిషీ. సినిమాల్లో జరుగుతాయ్ తప్ప నిజ జీవితంలో సాధ్యమరా అంటాడు.. అప్పుడే వసూ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది. గౌతమ్ చూసి..రేయ్ రేయ్ కారు ఆపరా..ఆ అమ్మాయిరా అంటాడు. ఎపిసోడ్ అయిపోతుంది.
తరువాయిభాగంలో గౌతమ్ వెళ్లి వసూతో మాట్లాడి..రిషీ దగ్గరకు తీసుకువచ్చి అరే లిఫ్ట్ ఇవ్వురా ప్లీజ్ ప్లీజ్ రా అని బతిమిలాడతాడు. రిషీ సరే అంటాడు. వసూ వెనుక సీట్ లో కుర్చుటాడు. రిషీ మనసులో రమ్మనగానే రావాలా అనుకుంటాడు. మీ పేరేంటండి అని గౌతమ్ అడిగితే..రిషీ వసుధార అంటాడు. తన పేరు నీకు ఎలా తెలుసురా అంటే..వసూ నేను సార్ వాళ్ల కాలేజ్ లోనే చదువుతున్నాను అంటుంది. గౌతమ్ కాలేజ్ పెట్టి మంచిపనిచేశావ్ రా అని..నేను ఎదైనా స్ట్రైట్ గా మాట్లాడతాను అండి..ఇక్కడ ఏం అనిపిస్తే అదే చెప్తాను అంటాడు. వసూ గుడ్ అండి..అలానే ఉండాలి..నాకు తెలిసిన కొందరు ఉన్నారు అని రిషీని ఉద్దేశించి.. మనసులో ఏం ఉన్నా బయటకు చెప్పరు, ఏదేదో ఊహించుకుని ఫెయిల్ అవుతూఉంటారు అంటుంది. ఈ సీన్ పిచ్చ కామెడిగా ఉంటుంది. ఒకవేళ గౌతమ్ కూడా వసూకోసం కాలేజ్ లో జాయిన్ అయితే ఉంటది రిషీకి మూములు సెగ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news