గుప్పెడంత మనసు 251: కంటతడి పెట్టిన రిషీ..కోపంతో రంగంలోకి దిగిన వసుధార

-

గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర సోఫాలో పడుకోవటం చూసి రిషీ బాధపడాతడు. ఏంటి డాడ్ ఇది..మీరు ఇలా వచ్చేస్తే అంటూ మహేంద్రను పట్టుకుని ఏడుస్తాడు. లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ అంటాడు. డాడ్ నా మీద కోపం వస్తే అరవండి, తిట్టండి, కానీ ఇలా చేయకండి అంటూ బాధపడతాడు. నా మీద ఇంకా మీకు కోపం పోలేదా డాడ్ అని అడుగుతాడు. మహేంద్ర..కోపం వచ్చి పోతుందేమో, బాధ బరువుగా ఇక్కడే నిలిచిపోతుంది అంటాడు. రిషీ సారీ డాడ్ అంటాడు. మహేంద్ర..రిషీ నన్ను తిట్టు, కోపంవస్తే అరువు క్షణకాలంలో మర్చిపోతాను, కానీ నా భార్యను అలా అంటే బాధేస్తుంది కదా రిషీ..ఇప్పటివరకూ జగతిని చాలా సందర్భాల్లో చాలా మాటలు అన్నావు, కానీ హద్దులు దాటి మాటలంటే బాధేస్తుంది రిషీ..20ఏళ్ల కాలాన్ని నేను జగతితో పోగొట్టుకున్నాను. దేవుడు మన ముగ్గురికి ఒక విచిత్రమైన శిక్ష విధించాడు..ఈ శిక్షా కాలం ఎంత కాలమో కాలమే నిర్ణయించాలి అంటాడు..మనకు ఇష్టమైన వాళ్లు ఒక్క మాటన్నా బాధేస్తుంది అంటూ బాధపడతాడు మహేంద్ర..

రిషీ సారీ డాడ్ అంటాడు..మహేంద్ర రామాయణంలో కప్పకు రాముడు బాణం గుచ్చిన సీన్ చెప్తాడు. నా పరిస్థితి కూడా ఆ కప్పలా అయిపోయింది రిషీ..నా గుండెల్లో ఉన్న నువ్వే నా గుండెను గాయపరిస్తే ఎలా చెప్పు అంటాడు. రిషీ ఆ మాటకు ఏడుస్తూ..మహేంద్రను పట్టుకుని నాకూడా మీరు తప్పా ఎ‌వరు ఉన్నారు…బంధమైన, బలమైన మీరే కదా..ఇంకెప్పుడు ఇలా చేయకండి డాడ్ ప్లీజ్ ప్లీజ్ అంటాడు. మహేంద్ర కోపం గురించి ఒక ఉదాహరణ చెప్తాడు..ఆలోచనలను, ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకో, మనల్ని మనం జయించాకే ప్రపంచాన్ని జయించగలం, ఆవేశం తగ్గించుకో అంటాడు. రిషీ..సరే డాడ్..మీరు ఇంటికి వెళ్లండి, నేను ఇక్కడే ఉంటాను అని తండ్రిని పట్టుకుని బాధపడతాడు. ఇద్దరూ ఏడుస్తారు. మొదటిసారి రిషీ కంట్లో కన్నీళ్లు..చాలా ఏమోషనల్ గా అనిపిస్తుంది.

రిషీ క్యాబిన్ లో ఆలోచిస్తూ..మహేంద్ర అన్న మాటలను తలుచుకుంటాడు. నా జీవితంలో మీరు ఎప్పుడూ కూడా ఇలా ఉండూ, అలా ఉండూ అని చెప్పలేదు, మొదటిసారి చెప్పారు, కోపం తగ్గించుకోమని చెప్పారు. ట్రై చేస్తాను డాడ్ అనుకుంటూ ఉంటాడు. వసూ క్యాబిన్ దగ్గరకు వస్తుంది. లోపలికి రావొచ్చా అని అడుగుతుంది. రిషీ వద్దు, నా మూడ్ ఏం బాలేదు మళ్లీ కలుద్దాం అంటాడు. వసూ అయినా వినకుండా కోపంగా లోపలికి వస్తుంది. ఇప్పుడే మాట్లాడాలి సార్, నాకు మీ మూడ్ తో సంబంధం లేదు అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, చెప్పానుగా తరువాత మాట్లాడదాం అని అంటాడు రిషీ.. సార్ ఇది కాలేజ్ విషయం కాదు, పర్సనల్ విషయం అంటుంది . పర్సనల్స్ నేను కాలేజీలో మాట్లాడను అంటాడు రిషీ. సార్ ఇది మీ పర్సనల్ విషయం అంటుంది వసూ..వసూ చాలా కోపంగా ఉంటుంది. రిషీ లేచి నా మనసు బాలేదు, నా మూడ్ కూడా బాలేదు, నేనిప్పుడు మాట్లాడలేను అంటుంటే నా కాబిన్ లోకి వచ్చి నా పర్సనల్స్ మాట్లాడతా అంటావేంటి, అసలేంటి నీ ధైర్యం అంటాడు రిషీ. వసూ సరే నేను మాట్లాడతాను మీరు వినండి, లేదా బయటకి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది. రిషీ సరే పదా అంటాడు. వసూ మనసులో ఇలానే మాట్లాడాలి..ఈరోజు రిషీ సార్ కి అస్సలు భయపడొద్దు అనుకుని వెళ్తుంది.

ఇంకోవైపు మహేంద్ర ఇంటికి వస్తాడు. దేవయాని వచ్చి ఏంటి మహేంద్ర ఇది.. రాత్రంతా ఇంటికి రాలేదు, నీకోసం అందరం ఎంత కంగారుపడ్డారో తెలుసా ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. కాలేజ్ గస్ట్ హౌస్ లో ఉన్నాను వదినా అంటాడు. దేవయాని ఉన్నావా, ఉన్నారా అని అడుగుతంది. అసలే మహేంద్ర కోపంతో, బాధతో ఉన్నాడు..ఆ మాటకు వదినా నీ మనసులో ఏముందో నాకు తెలసు, ఒక్క మాటతో మీరు ఏం అడగాలనుకున్నారో అన్నీ అడిగేశారుగా అంటాడు. ఏంటి మహేంద్ర ఇది..నిజాన్ని సూటిగా అడిగితే కోపాలొస్తాయి, మా గురించి కాకపోయిన కనీసం రిషీ గురించైనా ఆలోచించాలిగా నువ్వు అయినా నీకు ఈ కుటుంబంలో ఎ‌వరిమీద శ్రద్ధ ఉంది అంటుంది. మహేంద్ర కోపంతో నేను అన్నింటికి సమాధానం చెప్పగలను అంటాడు. ఇంతలో వెనక నుంచి ధరణి వెళ్లటం చూస్తాడు. ధరణి ముందు వదినకు గట్టిగా సమాధానం చెప్పటం బాగుండదు అనుకుంటా‍డు. కూల్ అయిపోయి.. వదినా..రిషీ నన్ను కలిశాడు, మీరు ఏం టెన్షన్ పడకండి అంటాడు. అయినా గెస్ట్ హోస్ లో పడుుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అని అడుగుతుంది. రిషీనాకో పని అప్పగించాడు..దానికోసం అక్కడే ఉండాల్సి వచ్చింది అంటాడు. ఆ పనేంటో తెలుసుకోవచ్చా అని దేవయాని అడుగుతంది. మహేంద్ర ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. దేవయాని మహేంద్ర ఏమంటున్నాడు నీకేమైనా అర్థమయిందా అని ధరణిని అడుగుతుంది. నేను అనుకోకుండా వచ్చి సగమే విన్నాను నాకేం అర్థంకాలేదు అంటుంది ధరణి..నిన్ను అడగటం నాదే బుద్ధితక్కువ, మొత్తం విన్న నాకే ఏం అర్థంకాలేదు, నీకు ఏం అర్థంకాదు అని వెళ్తుంది.

జగతి మహేంద్ర కోసం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ధరణి కాల్ చేస్తుంది. చిన్నమావయ్యగారు ఇప్పుడే వచ్చారని చెప్తుంది. జగతి సంతోషంగా థ్యాంక్యూ ధరణి అంటుంది. ఇటుపక్క వసూ రిషీ ఒకచోటుకు వెళ్తారు. రిషీ చెప్పు ఏదో మాట్లాడాలి అన్నావుగా అంటాడు. వసూ..ఉపోద్ఘాతం లేకుండా అడుగుతున్నాను, మేడమ్ ని ఏమన్నారు సార్ మీరు అని అడుగుతుంది. ఓహో విషయం నీదాకా వచ్చిందా, వస్తాయ్ లే అంటాడు రిషీ.. సర్ మీకు మేడమ్ అంటే ఇష్టం లేదు అంటుంది. రిషీ కోపంగా వసుధార అంటాడు. వసూ నన్ను మాట్లాడనివ్వండి అని సర్ మేడమ్ మీద మీకున్న అభిప్రాయం తప్పు, మీకు తెలియకుండానే మీరు మేడమ్ కి భయపడుతున్నారు అంటుంది. రిషీ నాన్ సెన్స్ నేను ఆవిడకి భయపడటమేంటి అంటాడు. వసూ..సార్ మీకు మహేంద్ర సార్ అంటే ఇష్టం, సార్ మేడమ్ తో ఉండటం మీకు నచ్చదు. మీకు ఎక్కడ దూరమైపోతారో అని భయం, ఆత్మన్యూనతభావం, ఇన్ సెక్యురిటీ ఫీలింగ్, దీన్నే సింపుల్ గా భయం అన్నాను అంటుంది.

ఆహా ఇలాంటి విశ్లేషణలు వినటానికా కాలేజ్ నుంచి తీసుకొచ్చింది అంటాడు రిషీ. నేను ముందే చెప్పాను, నేనే మాట్లాడతాను అని..మహేంద్ర సార్ మీకు ఒక కన్ను అయితే, జగతి మేడమ్ మరొక కన్ను, ఇవి రెండూ ఒక దానితో ఒకటి కీచులాడవ్ సార్ అంటుంది. రిషీ అయినా నా పర్సనల్ విషయంలో నీకేంటో అంత ఇంట్రస్ట్ అంటాడు. నేను మనసులోనే మాటలే చెప్తాను, ముందుగానే సిద్దపడే మాట్లాడటం లేదు అంటుంది వసూ. తెలుస్తోంది కదా నీ మనసేంటో, మాటలేంటో అంటాడు రిషీ.. వసూ కానీ మీ కొక విషయం తెలియటం లేదు అని వసూ అంటుంది. ఏంటో అది అని రిషీ అడుగుతా‍డు. వసూ జగతిమేడమ్ మనసు అంటుంది. వసుధార నేకేం తెలుసో ఎంత తెలుసో తెలియదు కానీ.. ప్రతిసారి నువ్వు నన్ను రాక్షసుడిలా భావిస్తుంటావ్ అని రిషీ కోపంగా అంటాడు. వసూ లేదు సార్, నేను ఎప్పుడు అలా అనుకోవటం లేదు అంటుంది. కానీ జగతి మేడమ్ మిమ్మల్ని మహేంద్ర సార్ ని దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు సార్ అని వసూ అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news