కార్తీకదీపం 1172 ఎపిసోడ్: పెద్ద స్కేచ్చే వేసిన ప్రియమణి..కార్తీక్ ముందు దొంగఏడుపులు

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప కార్తీక్ తప్పులను ఎత్తిచూపుతుంది. కార్తీక్ అది చేతకానితనం కాదు మీ మీద ప్రేమ అంటాడు. దీప ఇలా ఎంత కాలం భయపడుతూ పిల్లలకు సర్దిచెప్పుకుంటూ బతకాలి చెప్పండి, ఆదిత్య చెప్పినట్లు అమెరికా వెళ్లిపోదామా అంటుంది. దానికి భయపడి పారిపోయినట్లు అవుతుందేమో కదా అంటాడు కార్తీక్.. భయపడుతూనే ఉన్నాం కదా, ఆ చించుమొఖం దానికి మన ఫ్యామిలీ అంతా భయపడుతూనే ఉన్నాం..ఆలోచించండి డాక్టర్ బాబు,భయపడదామా, భయటపడదామా అంటుంది దీప. కార్తీక్..చూద్దాం దీప దాని శిక్ష పూర్తికావటానికి ఇంకా టైం ఉంది కదా అంటాడు.

karthika-deepam

కింద శౌర్య ఆరోజు ప్రియమణి అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది. దీప ఫుల్ ఫైర్లో వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే..ఆలోచిస్తున్నావ్ ను అమ్మా అంటుంది. ఇంకేమిగిలింది ఆలోచించడానికి, బుర్రలో అవసరంలేని చెత్తఅంతా వేసుకుని మీ నాన్నని భాదపడెతునే ఉన్నారు కదా ..ఇంకేం ఆలోచిస్తున్నారు అంటే ప్రియమణి గురించి అమ్మా అంటుంది శౌర్య. ప్రియమణి ఆ మోనిత ఆన్టీ దగ్గర పనిచేసిందంట కదా అంటే.. ప్రతిసారి తిరిగి తిరిగి ఆ మోనిత దగ్గరకే వస్తావ్ అంటుంది దీప. తనని ఎందుకు తీసుకొచ్చారమ్మా అంటే.. పాపం తనకి గడవటంలేదంటే తీసుకొచ్చాను అంటుంది దీప. ఆహా..పాపం అని రేపు ఆ మోనితను కూడా తీసుకొస్తావా అంటుంది. వీళ్లు ఇలా అరుచుకుంటూ ఉండగానే..సౌందర్య వస్తుంది. సౌందర్య కూడా గట్టిగా అరుస్తుంది శౌర్యమీద. ఈ పీతబుర్రలకు ఏదీ అర్థంకాదు..కనీసం ఆ శౌర్య చెప్పిన విషయం ఆలోచించవచ్చుకదా..దాన్ని చెడామడా తిట్టేశారు.

ఇంకోసీన్ లో కార్తీక్ హిమ గదిలోకి వచ్చి చేయి పట్టుకుని హిమ నా మీద నీకు కోపం రావటం కన్నా, నువ్వు ఆ కోపంతో జ్వరం తెచ్చుకున్నావ్ కదా అది నాకు బాధగా ఉందమ్మా, నా కోసం బాధపడుతూ నువ్వు జ్వరం తెచ్చుకోవద్దు అంటూ మాట్లాడతాడు. హిమ చేయలాగేసుకుని నువ్వంటే నాకు నచ్చటంలేదు డాడీ అంటుంది. కార్తీక్ సేమ్ పాటే పాడతాడు. నేను ఏ తప్పుచేయలేదు అంటాడు. హిమ నేను ఇక్కడ ఉండను డాడీ అంటుంది. నువ్వు వెళ్లిపోతే నేను ఇక్కడ ఎలా ఉంటాను, ఇన్నాళ్లు విడిపోయి ఉన్నాం, ఇప్పుడిప్పుడే కలిశాం కదరా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వుఇలా మాట్లాడకుండా ఉంటే ఊపిరాడనట్లు ఉంటుంది రా అంటూ ఏడుస్తాడు. ఇంతలో శౌర్య వస్తుంది. కార్తీక్ మనం బస్తీకి వెళ్దామా,హిమే చెప్పింది అంటూ కార్తీక్ మాట్లడతూనే ఉంటాడు. శౌర్య పడుకుంటే జ్వరం తగ్గదు అలా బయటకిపోదాం రా అని తీసుకెళ్తుంది.

బయట కుర్చుని హిమ శౌర్యలు మనం నిజంగానే బస్తీకీ వెళ్తున్నామా అని హిమ అడుగుతుంది. శౌర్య ఏమో అంటుంది.. డాడీ మీద నీకు కోపం పోయిందా అని హిమ అడుగుతుంది. లేదు నీకు పోయిందా అని శౌర్య అంటుుంది. వీళ్లు ఇద్దరూ ఇక వీళ్లకున్న అతితెలివితేటలతో ఏదేదో మాట్లాడుకుంటారు. అది మామూలే.

ఇంట్లో కార్తీక్ ఒక్కడే కుర్చుంటే..ప్రియమణి ఏడ్చుకుంటూ వస్తుంది. ఏమైంది అని కార్తీక్ అడిగితే..కార్తికయ్యా అంటూ ఏడుస్తుంది. కార్తీక్ చిరాకుగా..ముందు ఆ పిలుపు ఆపు అంటాడు. కార్తీక్ సార్ అంటుంది ప్రియమణి. ఇప్పుడు చెప్పు అంటే.. మళ్లీ ఏడుస్తూనే ఉంటుంది. నిన్ను ఇంటికి తీసుకురావటమే తప్పు..నీకు ఇప్పుడు ఓదార్పులు, సానుభూతులు కూడా చెయ్యాలా అని కార్తీక్ విసిగించికుంటాడు. దీప వచ్చిఏమైంది అంటే..నేను రెండుసార్లు అడిగాను చెప్పటంలేదు అంటాడు కార్తీక్. దీప ఇందాక శౌర్య అన్న మాటలను వినిఉంటదేమే అనుకుని ప్రియమణి తర్వాత మాట్లాడుకుందాం వెళ్లు అంటుంది. అయినా ఈ ప్రియమణి వీరలెవల్లో యాక్ట్ చేస్తుంది. పిల్లలు నన్ను అదోలా చూస్తన్నారు అంటూ మొదలపుపెడుతుంది. తర్వాత మాట్లాడుకుందా అని చెప్పాగా వెళ్లు అంటుంది దీప. పోతుంది. కార్తీక్ ప్రియమణి ఇంట్లోకి రావటం నాకే కాదు, పిల్లలకి కూడా ఇష్టంలేదు అదే కదా మ్యాటర్. అసలు ఈ ప్రియమణిని తెచ్చింది కూడా నేనే అనుకుంటారు. అసలు ఎందుకు తెచ్చావ్ అంటే..ఏదో సాటి స్త్రీగా జాలిపడి తీసుకొచ్చాను..ఇంట్లో ఆ మాత్రం స్వాతంత్రం కూడా లేదా నాకు అని దీప అంటుంది. ఇప్పుడు స్వాతంత్రం వరకూ ఎందుకులే దీప అంటాడు కార్తీక్.

కట్ చేస్తే మురళీకృష్ణ దగ్గరకు భాగ్యం వచ్చి ఏంటయ్యా అలా అన్నావ్ నా మీద ఇంకా కోపం పోలేదా అంటుంది. మనోడు అరుస్తాడు. భాగ్యం దీప ఇంటికి వెళ్దాం తనని కూడా రామ్మంటుంది. నేను రాను నువ్వు వెళ్లు అంటాడు..అలా వాళ్లు కాసేపు మాట్లాడుకుంటారు.

మరోసీన్ లో జైలుకి సౌందర్య వస్తుంది. మోనిత ఇదేంటి సడన్గా ఈ లేడీహిట్లర్ వచ్చంది అనుకుని హాయ్ ఆన్టీ, వెల్కమ్ టూ జైల్ అంటుంది. సౌందర్య లోపల భయపడుతూనే పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నావా అంటుంది. అది పెద్దలమీద గౌరవంతో కూడిన భయం అంటుంది మోనిత. ఇలా ఒకరిమీద ఒకరు కౌంటర్ ఇచ్చుకుంటూ డైలాగ్స్ వేసుకుంటారు. నీ ముఖం నేను జీవితంలో చూడకూడదు అనుకున్నాను అని సౌందర్య అంటే.. నేను కూడా బిడ్డను కని మీకు ఇచ్చే వరకూ చూడకూడదు అనుకున్నాను…ఇంతలో మీరే వచ్చారు. నా కోసం ఏం తెచ్చారు అంటుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

– Triveni Buskarowthu