ఆర్కే లాంటి గెరిల్లా ఉద్యమకారులు మళ్ళీ పుడతారు : ఆర్కే భార్య

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మరియు కేంద్ర కమిటీ సభయడు అక్కిరాజు హర గోపాల్ అలియాస్ సాకేత్హ్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఆర్కే మృతి పై భార్య శిరీష ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్కే ఓ గొప్పవ్యక్తీ… ప్రజా సమష్యలపై ఆయన పోరాటం అమోఘ మైనదన్నారు. భర్త ఆర్కేతో పాటు… కుమారుడు మున్నా అమర వీరత్వం పొందడాన్ని నేను గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.

తాను ఒంటరినైపోయాననే భాద ఇప్పటికి ఎప్పటికి ఉండదని వెల్లడించారు. అల కూరపాడులోని కుమారుడు మున్నా స్మారక్ స్థూపం పక్కనే ఆర్కే స్మారక చిహ్న ఏర్పాటు అనేది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియ జేశారు. ఆర్కే మృతి చెందడం బాధాకరమని.. అయినప్పటికీ ఆయన లాంటి గెరిల్లా ఉద్యమకారు లు మళ్ళీ పుట్టు కొస్తారని స్పష్టం చేశారు. ఆర్కే మృతి తో ఉద్యమం ఆగిపోతుందని ప్రభావం తగ్గిపోతుందనడం సరైంది కాదని ఆర్కే భార్య శిరీష చెప్పారు. ఉద్యమం అస్సలు ఆగబోదని వెల్లడించారు.