కార్తీకదీపం 1181 ఎపిసోడ్: నిజం తెలుసుకున్న దీప..పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప కారులో వెళ్తూ ఉంటుంది. డాక్టర్ బాబు, అత్తయ్య ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకా ఏం దాస్తున్నారు అసులు అంటూ బుర్రబద్దలయ్యేలా ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి అక్కా అమెరికా ప్రయాణం ఎందుకు కాన్సిల్ అయింది అంటాడు. దీప కసురుకుంటుంది. ఇంకోసీన్ లో మోనిత చచ్చిపోయాలా ఉంటుంది. కార్తీక్ రాకుండా నేను ఆపరేషన్ చేయించుకోను, నేను చచ్చిపోయేలోగా కార్తీక్ కు ఒక నిజం చెప్పాలి అంటుంది. మోనిత కొత్త నాటకమేమే ఇది. ఇంజన్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయకుండా ఈ భారతి ఏంటో మోనిత చెప్పే పిట్టకథ అంతా వింటుంది.

karthika-deepam

ఇంకోసీన్ లో దీప ల్యాబ్ కి వచ్చి హిమ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము రిపోర్ట్స్ వచ్చాయా అంటే..వచ్చాయని స్టాఫ్ వెళ్తుంది. దీప అక్కడ మాతృ స్రీ సంతానసాఫల్యం సెంటర్ రిపోర్ట్ చూస్తుంది. టెస్టులకోసం కార్తీక్ శాంపిల్స్ ఇచ్చింది ఇక్కడే. దీప ఆ స్టాఫ్ పై విరుచుకుపడుతుంది. ఇక్కడ వచ్చే డబ్బులు సరిపోక నువ్వు ఆ మోనితకు శాంపిల్స్ ఇస్తావా, నువ్వు మనిషివేనా అని తిడుతుంది. ఆమెకు ఏం అర్థంకాదు..మోనిత ఎవరో నాకు తెలియదు అంటుంది. మీ వారు ఇచ్చిన శాంపిల్ ని మేము వేరేవాళ్లకి ఎలా ఇస్తాం అంటుంది. ఇలా దీపకు ఆ ల్యాబ్ లో ఉన్న ఆమెకు మధ్య గట్టిగానే గొడవ జరగుతుంది. ఆమె మేము ఆ శాంపిల్ ఎ‌వరికి ఇవ్వలేదు..కార్తీక్ గారు టెస్ట్ కి శాంపిల్ ఇచ్చారుకానీ, రిపోర్ట్ కూడా ఇంకా తీసుకెళ్లలేదు, మా దగ్గర నుంచి బయటవాళ్లకు కోటి రూపాయాలు ఇచ్చినా ఇవ్వం, మీరు కేసు పెడితే పెట్టుకోండి అంటుంది. దీప సైలంట్ అయిపోతుంది.

మరోపక్క కార్తీక్, సౌందర్య మోనిత దగ్గరకు వస్తారు. మోనిత అప్పటికే స్రొహ కోల్పోతుంది. భారతి మోనితను లేపుతుంది. కార్తీక్ ఇది నిజమేనా అంటాడు. భారతికి మండిపోతుంది..ఎన్నిసార్లు సిరంజ్ తోసేసిందో తెలుసా, మోనిత ప్రాణాలు కాపాడటానికి మేమెంత కష్టాపడ్డామో తెలుసా అని మోనితను లేపుతుంది. అమ్మగారు లేచి కార్తీక్ వచ్చావా కార్తీక్ అని ఏడుస్తుంది. భారతి ఇంజన్షెన్ చేయించుకో అంటుంది. ఇప్పటివరకూ నిద్రపోయిందిగా..ఇంజన్షన్ చేసి ఆపరేషన్ చేయొచ్చుగా..మళ్లీ మోనితను బతిమిలాడుతున్నారు. మోనిత నేను నీకొక నిజం చెప్పాలి..నేను ఇంకా బ్రతకను, నాకు తెలిసిపోతుంది. కార్తీక్ నేను చెప్పేది జాగ్రత్తగా విను..ఇది ఆర్టిఫీషియల్ ఇన్సెమ్యూనేషన్ గర్భం కాదు..నీ వల్లే నేను సహజంగా తల్లిని అయ్యాను అంటుంది. కార్తీక్ స్టాప్ ఇట్ మోనిత, కొత్త నాటకానికి తెరలేపింది, చూడు మమ్మీ వెళ్దాం పదా అంటాడు.

మోనిత ఏడుస్తూ..అబద్ధం కాదు కార్తీక్, నేను ఇన్నాళ్లు ఏవేవో ప్లాన్స్ చేసి ఉండొచ్చు, కానీ ఇది నిజం నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టు అంటుంది. కార్తీక్ నమ్మడు. పురిటి నొప్పులను భరించటమే సాధ్యంకాదు, కానీ ఆపుకున్నాను నన్ను నమ్ము అంటుంది మోనిత. కార్తీక్ పదమమ్మీ వెళ్దాం ఏంటి భారతి ఇది అంటే..నాకు ఇప్పటివరకూ తెలియదు కార్తీక్ అంటుంది భారతి. మోనిత సౌందర్యకు చెప్తుంది. కావాలంటే కార్తీక్ శాంపిల్ ఇచ్చిన ల్యాబ్ కి వెళ్లి ఎంక్వైరీ చేసుకోండి అంటుంది. ఇన్నాళ్లు ఎందుకు అలా చెప్పావ్ అని కార్తీక్ అంటాడు. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికే కార్తీక్, పెళ్లి కాకుండానే తల్లి అయితే నన్ను పతిత అంటారు, ఒకరోజు నువ్వు బాగా తాగి ఉన్నావ్ అనుకోకుండా అలా జరిగిపోయింది కార్తీక్ అంటుంది. కార్తీక్ ఏంటి మమ్మీ ఈ దరిద్రం వెళ్దాం పదా అంటాడు.

భారతి పాపం చచ్చిపోతుంది కార్తీక్ తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు..ముందు ఆపరేషన్ చేద్దాం అంటుంది. చావని భారతి, రోజుకు ఎందరో చనిపోతున్నారు..వాళ్లలో ఒకరు అనుకుంటాను అంటాడు. మోనిత నేను చచ్చిపోతేనే నువ్వు నమ్ముతావంటే నేను చస్తాను కార్తీక్, నా బిడ్డను అనాథను చేయకు కార్తీక్ నా మాట నమ్ము అంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో కార్తీక్ సైన్ చేస్తాడు. ఇంట్లో ప్రియమణి దీపతో జరిగింది అంతా చెప్తుంది. కార్తీక్, సౌందర్య వాళ్లు వెళ్లింది హాస్పటల్ కి అని, కార్తీక్ సంతకం చేశారు అని..గుమ్మడిపండంటి మగపిల్లాడు పుట్టాడంట అమ్మా, డాక్టర్ బాబు తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడారమ్మా అంటుంది. పాపం వంటలక్క గుడికి అని వెళ్లింది అక్కడికా అనుకుంటూ ఉంటుంది. ఎలా అయితే మోనిత అనుకున్నది సాధిస్తుంది. ఉచ్చులో కార్తీక్ మళ్లీ పడ్డాడు.