కార్తీకదీపం ఎపిసోడ్ 1159: కార్తీక్ ను కలవటానికి ప్లాన్స్ వేస్తున్న మోనిత..ఈసారి ఏం స్కెచ్ వేయబోతుందో

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు ఏం మాట్లాడుకుండా వెళ్లడంతో కార్తీక్ మెట్లపై కుర్చుంటాడు. దీప ఆ పేపర్ ఏంమైనట్లు అని ఆలోచిస్తుంది.  పిల్లలు మళ్లీ అలిగారంటే పేపర్ చూసుంటారా అని అనుమానిస్తుంది..వీటన్నింటికి ఒకటే పరిష్కారం అని ఏదో డిసైడ్ అవుతుంది. ఇంకోసీన్ లో సౌందర్య కూతురి ఇంటికి వెళ్తుంది. ఏం మాట్లాడవేంటే అని సౌందర్య కుతురిని అడిగితే..మన మధ్య మాట్లేం ఉంటాయ్ అమ్మా అని స్వప్న అంటుంది. గతాన్ని నువ్వు ఇంకా మనసులో మోస్తున్నావా అని సౌందర్య అడుగుతుంది. అది కేవలం గతం మాత్రమే కాదు..నా మనసుకు నువ్వు చేసిన గాయం అని స్వప్న అంటుంది. సౌందర్య నేను మారిపోయాను స్వప్న అంటే… కానీ నేను మారలేదు, మారాలాని కూడా అనుకోవటం లేదు అంటుంది స్వప్న.
అలా వాళ్లు మాట్లాడుకుంటూ స్వప్న అసలు విషయం చెప్తుంది. స్వప్న కూతురు నల్లగా పుట్టిందని సౌందర్య దూరం పెట్టిందట..అది విషయం. ఇప్పుడు కార్తీక్ కూతురు కూడా నల్లగా ఉంది కదా తననెందుకు వెళ్లగొట్టలేదు అంటుంది.  ఇలా తల్లీకూతుర్లు వాదించుకుంటారు. సౌందర్య నా మనవరాలు ఏది అంటే..నీ మనవరాలు కాదు..నా కూతురు. అది ఇండియా రానంది, ఎవరిమీద కోపమో అని స్వప్న అంటుంది. కార్తీక్ విషయంలో జరిగిందానికి నిలదీస్తుంది స్వప్న. నీ పుత్రరత్నం చేసిన పనులు ఊరూవాడ చెప్పుకుంటుందని స్వప్న అంటుంది. సౌందర్య కొడుకును అంటే ఊరుకోదుగా..నా పుత్రరత్నం జాతిరత్నం అంటూ పొగుడుతుంది. ఇంటికొస్తవా అని సౌందర్య అడుగుతుంది. నేను రానమ్మ నువ్వు కూడా రాకపోతే సంతోషిస్తాను అంటుంది. పాపం సౌందర్య బాధపడుతుంది. ఇంతలో మనవళ్లు వచ్చి ఈ తాతయ్య, అమ్మమ్మలు మాకు బాగా నచ్చారు అంటారు. కొత్తలో అన్నీ బాగుంటాయ్ రా..ముందు ముందు తెలుస్తుంది వాళ్ల రంగులు ఏంటో అని సౌందర్యను ఉద్దేశించి అంటుంది. పిల్లలకు ఏం అర్థంకాదు. వెళ్లొస్తం స్వప్న అంటే..మళ్లీ రాకపోతే సంతోషిస్తాను, నేను మీ కుతుర్ని అని ఎ‌వరికి చెప్పకుంటే ఇంకా సంతోషిస్తాను అంటుంది. అలా వాళ్లు వెళ్లిపోతారు.
ఇటువైపు మోనిత ..కార్తీక్ ను కలుసుకోవటానికి భారతీ ప్లాన్ చేసుకోమంది..కానీ ఏం ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సుకన్య వచ్చి మీకోసం ఎవరో వచ్చారు అంటుంది. నన్ను చూడ్డానికి ఎ‌వరు వచ్చారు అబ్బా..ఏ ప్రియమణో, రత్నసీతో అయి ఉంటారు అనుకుంటుంది. మరోపక్కకార్తీక్ రూం కుర్చుని పిల్లల ప్రవర్తను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అద్దంలో తన ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. అందిరకి వైద్యం చేసే కార్తీక్..తన జీవితాన్ని బాగుచేసుకోలేకపోతున్నాడా అని ఆత్మ చెబుతుంది. ఇంతలో సౌందర్య వచ్చి ఏం చేస్తున్నావ్ రా అంటే ఆత్మపరిశీలన చేసుకుంటున్నా మమ్మీ అంటాడు. పిల్లల విషయంలో కార్తీక్ బాధపడుతుం‍డటంతో నువ్వు పిల్లల విషయంలో ఎక్కువ బాధపడకురా అంటూ నాలుగు మంచిమాటలు చెబుతుంది. కార్తీక్ మనసు ప్రశాంతంగా ఉంటుందేమో అని ఆసుపత్రికైనా వెళ్లొస్తాను అంటూ స్వప్నక్క ఏం అంటుంది అంటాడు. జరిగింది చెబుతుంది. అలా మాట్లాడుకుని కార్తీక్ హాస్పటల్ కి బయలుదేరతాడు.
జైల్లో మోనితను కలవటానికి దీప వస్తుంది. దీపక్కా నువ్వొచ్చావా, ఎవరో ఎ‌వరో వస్తారునుకుంటే నువ్వొచ్చావా అని అంటుంది. నీ కోసం ఎ‌వరూ రారు అని దీప అంటుంది. మోనిత ఎవరూ రావక్కర్లేదు..నా మనసులో మన కార్తీక్ ఉన్నాడు. కడుపులో బిడ్డ ఉన్నాడు అని ఏంటి ఏదో తెచ్చినట్లు ఉన్నావ్..పుల్లటి మావిడికాయలా అవి తినే స్టేజ్ దాటిపోయాను అక్కా అంటుంది. నన్ను అలా పిలవకు కంపరం వేస్తుంది అంటుంది దీప. చేతిలో ఉన్న సంచి తీసుకుంటుంది అందులో ఆపిల్స్ ఉంటాయ్. తీసుకుని తినబోతుంది..కొంపతీసి దీనిలో పాయిజన్ కలిపావా అంటుంది. నీ క్రిమినల్ బ్రెయిన్ అంతకంటే ఎక్కువ ఆలోచించలేదులే కాని తిను అంటుంది దీప. మోనిత దీపకు మండేలా మాట్లాడుతుంది. కార్తీక్ ఎలా ఉన్నాడు. టైంకు తింటున్నాడా అంటుంది..దీపకు కాలిపోతూ ఉంటుంది. పేపర్లో జీవితాగాథలు ఎందుకు వేయిస్తున్నావ్..అవి చదివి ఎ‌వరు నమ్మరు..చదివి ఉమ్మేస్తారు అంటుంది దీప. కానీ నా ఇంటర్వూకి బయట స్పందన బాగా వచ్చిందట..జైల్లో నా ఫ్యాన్స్ చెప్పారు అంటుంది మోనిత. ఒక్కటి గుర్తుంచుకో నేనుండుగా నువ్వు నా భర్తను పొందటం అసాధ్యం అంటుంది దీప. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news