కార్తీకదీపం: తనను వదిలి వెళ్లొద్దని భార్యాబిడ్డల ముందు మోకాళ్లపై కుర్చుని ప్రాధేయపడిన కార్తీక్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ సౌందర్యతో హిమ ప్రవర్తన చెప్పుకుంటూ బాధపడతాడు. ఆదిత్య మళ్లీ అన్నయ్య నేను చెప్పింది ఓ సారి సీరియస్ గా ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంకోవైపు శౌర్య హిమతో నాన్న మంచోడేఏమో కదా..మనం చూసినవన్నీ కరెక్ట్ కావలనే ఏముంది చెప్పు అంటుంది. హిమ నేను ఆసుపత్రిలో విన్నది అంతా చెప్పినా నీకు అర్థంకాలేదా, ఎ‌వ్వరూ చూడకపోతే వాళ్లిద్దరూ మాట్లాడుకుంటే మీ నాన్న ఏం మాట్లాడటం లేదు తెలుసా.. శౌర్య మీ నాన్న ఏంటి..మన నాన్న..ఎంత కోపం ఉన్నా, నాన్న మీద అలుగు, మాట్లాడకు అంతే కానీ పిలవటం మానేస్తావా అంటుంది. హిమ నాకు పిలవాలనిపించటం లేదంటే అర్థంచేసుకో, నాన్న అమ్మను మోసం చేశాడు శౌర్య, అమ్మ పాపం మళ్లీ వంటలక్క అవుతుందో, మోనిత ఆన్టీ జెల్లు నుంచి వచ్చాక మీ నాన్న మోనిత ఆన్టీని పెళ్లి చేసుకుంటే మళ్లీ మనం ఏ విజయవాడో, విజయనగరమే వెళ్లాలి అని చెప్తుంది. నువ్వు చెప్తుంటే భయంగా ఉంది హిమ అంటూ శౌర్య కూడా ఏడుస్తుంది. హిమ ఇక గతంలో కార్తీక్ మోనితతో క్లోస్ గా ఉన్నది చెప్తుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటారు.

ఇంకోసీన్ లో భాగ్యంతో మురళీకృష్ణ జరిగిందంతా చెప్తాడు. వెళ్లి ధైర్యం చెప్పిరావాలి కదా భాగ్యం అంటే..వెళ్లి చెప్పొద్దామయ్యా అంటుంది. ఇంట్లో తులసీకోటకు దీప పూజ చేస్తూ..పిల్లల మనసులు మారేలా చూడమ్మా అంటుంది. జైల్లో మోనితకు కార్తీక్ వాళ్లు అమెరికా వెళ్లటం గురించి ప్రియమణి చెప్పిందని సుకన్య చెప్తుంది. ఈ మాట వినగానే మోనిత చిర్రెత్తిపోతుంది. ఏం చేయాలి ఏదో ఒకటి చేసి వాళ్లను ఆపేయాలి అనుకుంటూ తెగ హైరానా పడుతుంది. అసలూ ఈ ఐడియా ఎ‌వరు ఇచ్చారు అంటే..ఎ‌వరో ఆదిత్య ఇచ్చాడని చెప్తుంది సుకన్య..వాడ్ని ఆ యాక్సిడెంట్ లో లేపేసిన సరిపోయేది అని..వాళ్లని సిటీ దాటకుండా ఏంచేయాలి అని ప్లాన్ ఆలోచిస్తుంది.

దీప ఇంటిబయట ప్రస్తుత పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో హిమ-శౌర్యలు లగేజ్ బ్యాగ్ లతో ఎంట్రీ ఇస్తారు. ఏంటీ, ఈ బ్యాగ్ లేంటి అంటుంది దీప. శౌర్య వారణాసికి ఫోన్ చేశానమ్మా వస్తున్నా అన్నాడు అంటుంది. హిమ ఈ ఇంట్లోంచి వెళ్లిపోదాం అమ్మా అంటది. మీరు ఇలా బ్యాగ్ లతో వస్తే నాన్న, నానమ్మ చూస్తే బాగుండదు అంటుంది దీప. పిల్లలు ఇక్కడ ఏం బాలేదు.. బస్తీలోనే బాగుంది, సంతోషాలు లేవమ్మా, అన్నీ అబద్ధాలే ఉన్నాయి అంటుంది హిమ. దీప కోపంతో..అబద్ధాలు ఏంటి, అన్నీ మీరనుకుంటే సరిపోతుందా,నోరు మూసుకుని లోపలికి వెళ్లండి, జానడంతలేరుకని అన్నీ పెద్దప్రశ్నలు అని అరుస్తుంది . మేమేం చిన్నపిల్లలం కాదు, అన్నీమాకు అర్థమవుతున్నాయ్, నువ్వ అక్కడ వంటలక్కలాగనే బాగున్నావ్ అమ్మా, వెళ్లిపోదాం అమ్మా, డాడీ మాకొద్దు అంటుంది హిమ. ఇంతలో కార్తీక్ వచ్చి హిమ బ్యాగ్ లు సర్దుకుని వెళ్లిపోతున్నారా, నాన్న మీకొద్దా అంటూ హిమ వాళ్లను పట్టుకోబాతుడు..వాళ్లు వెళ్లి దీప వెనకాల నుల్చుంటారు. కార్తీక్ కుప్పకూలిపోతాడు.. మోకాళ్లపై కుర్చుని మీకు దన్నం పెడతానే నన్ను వదిలి వెళ్లకండి అంటాడు. దీప ఏడుస్తూ..ఏంటిది డాక్టర్ బాబు..వీళ్లెక్కడికి వెళ్లరు అని దీప పిల్లలను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది.

ఆదిత్య చూస్తాడు. కార్తీక్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందో నేను ఊహించగలను, నా మాట విని అమెరికా వెళ్లిపోండి అంటూ మళ్లీ చెప్తాడు. మనోడు అక్కడికి వెళ్లటం దీపకు ఇష్టం లేనట్లు ఉందిరా అంటాడు. వదినను నేను ఒప్పిస్తాను అంటాడు ఆదిత్య..ఇంతలోనే దీప పరుగెట్టుకుంటూ వచ్చి డాక్టర్ బాబు హిమకు ఉన్నట్లుండి ఒళ్లు కాలిపోతుంది అంటుంది. వీళ్లు వెళ్లే లోపే ప్రియమణి హిమకు ఎక్కిస్తూ ఉంటుంది. కార్తీక్, మోనిత ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా, వాళ్లు కలిస్తే ఏంటి, కలవకపోతే నీకేంటి..ఏమో కలవొచ్చేమో అంటుంది. ఇంతలో దీపవాళ్లు వస్తారు. ఎపిసోడ్ ముగుస్తుంది.