కార్తీకదీపం ఎపిసోడ్ 1235: రుద్రాణ్ని ఎదిరించటానికి రెడీ అయిన..శ్రీవల్లి- కోటేష్..ఇంకో అప్డేట్ తెచ్చిన రత్నసీత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత బ్యాగ్ తీసుకొచ్చి పడేసిన సౌందర్య.. ఇంకోసారి ఈ గడప తొక్కాలని ప్రయత్నించకు అని హెచ్చరిస్తుంది. మోనిత..బ్యాక్ తీసుకుని.. థ్యాంక్యూ ఆన్టీగారు.నేను బాధ్యత మరిచిపోయినా మీరు నానమ్మ హోదాలో నా కొడుకుని ఎవరు ఎత్తుకెళ్లారో వీడియో ఫుటేజ్ చూపించారు.. కానీ నన్ను గడప తొక్కొద్దనడం సరికాదు.. నా కొడుకు, మీ కొడుకుని వెతికి పట్టుకుని మళ్లీ కోడలి హోదాలో మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడతా అని చెప్పి అందరికి జాగ్రత్తలు చెప్పేసి వెళ్లేప్పుడు కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేసి వెళ్తుంది.

దీప ఇంట్లో

శ్రీవల్లి-కోటేష్ తీసుకొచ్చిన బాబుకి నామకరణ జరుగుతుంది.. బాబు పేరు పెట్టాలని నిర్ణయించారని పంతులు అడగడంతో..ఆనంద్ చెబుతారు..ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి..రంగరాజు పేరు పెట్టమని చెబుతుంది. ఏం శ్రీవల్లి పేరు బాగుందా అనటంతో..అక్కడ వాళ్లు అంతా..షాకై నిలబడతారు. నామకరణంతో పాటూ ఇప్పుడు వీడిని నేను దత్తత తీసుకుంటున్నా అని బాబుని లాక్కుంటుంది. ఇది అన్యాయం అని కోటేష్ ఏడవడంతో.. న్యాయం-అన్యాయం ఉండవు బలవంతులు చేసినదే న్యాయం అంటుంది రుద్రాణి. శ్రీవల్లి కాళ్లు పట్టుకున్నా..రుద్రాణి కరగదు. మీరు తప్పుచేస్తున్నారు బిడ్డని ఇవ్వండి అని దీప అడ్డుపడుతుంది. రుద్రాణి మీకు-ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదు..అనవసరంగా కల్పించుకోకు అంటుంది. కార్తీక్ కూడా మాట్లాడబోతే.. ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు ఆపండి అని హెచ్చరిస్తుంది. మీకు డబ్బులిస్తానని సంతకం పెట్టాకదా అని కార్తీక్ అనడంతే..మీకు డబ్బులిస్తానని సంతకం పెట్టాకదా అంటాడు కార్తీక్. అయితే నీ కూతుర్ని తీసుకెళ్లాలా అనడంతో రుద్రాణి.. కార్తీక్ చెవిలో చెబుతుంది.కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. రుద్రాణి..వందమందని పిలుస్తాను…నువ్వు-నీ పిల్లలు-మీ ఆయన అన్యాయం అయిపోకుండా ఉండాలంటే నాకు అడ్డుపడొద్దని బెదిరిస్తుంది రుద్రాణి. దీప అడ్డువస్తుంటే..రుద్రాణి నీ పిల్లల మీద ప్రేమ ఉంటే..అడ్డుపడకు అంటుంది. తమ్ముడు అని పిల్లలు ఏడుస్తుంటే..రంగరాజు తమ్ముడు అనండని చెప్పి రుద్రాణి వెళ్లిపోతుంది.

సౌందర్య ఇంట్లో

మోనిత వెళ్లడంతో..సౌందర్య ఉత్సాహంగా..ఆదిత్య ఇక్కడేం చేస్తున్నావ్ వంటగదిలోకి వెళ్లి మా ముగ్గురికీ మంచి కాఫీ కలిపి తీసుకురా అంటుంది. ఆనంద్ రావు ఏంటి సౌందర్య చాలా ఉత్సాహంగా ఉన్నావ్ అంటే.. ఈ మోనిత బిడ్డ విషయంలో మనకో క్లారిటీ వచ్చింది కాబట్టి చాలా రిలీఫ్ గా ఉంది అంటుంది సౌందర్య. మనమేదో ఎత్తుకొచ్చామని నోటికొచ్చినట్టు వాగిందని శ్రావ్య అంటుంది. రత్నసీత చాలా సహాయం చేసిందని అని సౌందర్య అంటుంది…ఇదే రత్నసీత ద్వారా అన్నయ్య జాడ కనిపెట్టొచ్చు కదా అనుకుంటారు ఆదిత్య. మోనిత మొహంలో బాబు పోయిన బాధ లేదని శ్రావ్య అంటే.. ఎందుకు ఉండదమ్మా.. మనముందు గాంభీర్యం నటిస్తుంది..అంతే అంటాడు ఆనందరావు. మోనితపై కోపంతో బాబు విషయంలో కాస్తంతా సానుభూతి కూడా చూపించలేదు..అంటాడు.

దీప ఇంట్లో

శ్రీవల్లి..ఏడుస్తుంది.ఎన్నో కాన్పులు పోతే దేవుడిచ్చిన కొడుకుని కూడా తీసుకెళ్లిపోవడం ఎంతవరకూ కరెక్ట్ అక్కా అని ఏడుస్తుంది శ్రీవల్లి. నా ఇల్లు లాక్కున్నా నేను బాధపడలేదు అక్కా అంటూ.. శ్రీవల్లి ఏడుస్తుంది. కోటేష్ ఏం చేయగలం శ్రీవల్లీ అంటే..ఇల్లు వదిలేసుకుందాం బాబుని వదిలేయలేం కదా అని శ్రీవల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామంటుంది. కోటేష్ కంగారుపడి రుద్రాణిపై కంప్లైంట్ ఇస్తావా, మనం ఇస్తే వాళ్లు తీసుకుంటారా అంటాడు..శ్రీవల్లీ తల్లి పడే బాధేంటో మీ మగాళ్లకి తెలియదంటుంది శ్రీవల్లి. మనం కూడా సాయం చేద్దాం అంటుంది దీప.కార్తీక్ మనం ఉన్న పరిస్థితుల్లో అని ఏదో చెప్పబోతాడు..శ్రీవల్లి ఒప్పుకోదు. పోలీస్ స్టేషన్ కి వెళితే మన ఆచూకీ తెలిసిపోతుందని దీపతో కార్తీక్ నెమ్మదిగా అంటాడు కార్తీక్. శ్రీవల్లి వెళ్లడంతో కోటేష్ కూడా వెనకే వెళతాడు. సాయం చేయగలిగి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం కదండి అంటుంది దీప.. పరిస్థితిని బట్టి మనం మసులుకోవాలి దీపా అంటాడు కార్తీక్. అది కరెక్టేనండి..ఇందాక రుద్రాణి మీతో ఏదో మాట్లాడుతోందని అడుగుతుంది.. సమాధానం చెప్పకుండా..తలనొప్పిగా ఉంది కాఫీ కావాలని మాట దాటవేస్తాడు. కార్తీక్ అగ్రిమెంట్ గురించి తలుచుకుంటాడు.

వంటలక్క ప్రజా వైద్యశాల

ప్రజా వైద్యశాలలో కూర్చున్న మోనిత బాబుని వీడెవడో ఎందుకు ఎత్తుకెళ్లాడు.. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోటోస్ పంపించాను ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటుంది. తనకి తాను ధైర్యం చెప్పుకుంటుంది. నరసమ్మ ఖాళీగా ఉన్నాంకదా అని దోమలు కొట్టుకుంటున్నావా అంటుంది. మీరు అంత పెద్ద డాక్టర్ కదా సిటీలో ఆసుపత్రి పెట్టకుండా ఇక్కడ పెట్టారేంటని అడుగుతుంది. నరసమ్మ నువ్వు నన్ను ప్రశ్నలు వేయొద్దు..నేను అడిగితే సమాధానం మాత్రమే చెప్పాలి అంటుంది. ఇంతలో..బస్తీలో వాళ్లతో వారణాసి..నేను హాస్పటల్ కి వెళ్తాను అన్నా అంటే..కోటేష్ ఈ ఆసుపత్రికి వెళ్ళరా అంటే..ఛీ ఇదా అని వెళ్లిపోతాడు వారణాసి. అదంతా చూసిన మోనిత.. మన ఆసుపత్రికి రాకూడదని డిసైడ్ అయ్యారా అని నరసమ్మ అడుగుతుంది. చూస్తూ ఉండు వాళ్లే వస్తారు అని ఎలుక కథ చెప్తుంది. కోటేష్ ఫొటో చూసి నువ్వు నాకు దొరకాలి నీసంగతి చెప్తాను అనుకుంటుంది. మరోవైపు ఏంటి ఆలోచిస్తున్నారు సామీ అంటూ కార్తీక్ ను దీప అడుగుతుంది. రుద్రాణి గురించి అంటాడు కార్తీక్. మంచో-చెడో అయిపోయిన దారిగురించి ఆలోచిస్తే ఏమొస్తుంది అంటుంది. ఆ రోజు నేను రుద్రాణి మనుషుల్ని కొట్టకుండా ఉండాల్సింది అంటే.. నేను ఏకంగా రుద్రాణినే కొట్టా కదా అంటుంది దీప. మనం మన పరిస్థితుల్లన్ని మర్చిపోయి అనవసరం వాటిల్లో తలదూర్చుతున్నామో దీప అని కార్తీక్ అంటాడు.. ఎపిసోడ్ ముగిసింది

రేపటి ఎపిసోడ్ లో

కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి దగ్గరకు వెళతారా అని షాకవుతుంది దీప. రిస్క్ అయినా పర్వాలేదు నేను పోలీస్ స్టేషన్ కి వెళతా కోటేష్-శ్రీవల్లికి అండగా ఉండా అంటాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడిని రత్నసీత.. సౌందర్య ఇంటికి తీసుకొస్తుంది. ఊరు వదిలి వెళ్లిపోయేటప్పుడు ఫోన్ పడేసి బస్సెక్కి వెళ్లిపోవడం గురించి సౌందర్యకి చెబుతాడు.