డిజిట‌ల్ టోన్స్ : బ‌న్నీ ఖాతాలో మ‌రో బిరుదు ఎందుకంటే?

గుర్తుపెట్టుకోండి ఇక్క‌డ ఎవ‌డి డ‌ప్పు వాడే కొట్టుకోవాలి..అందుకు త‌గ్గ వేదిక ఏదో వెతుక్కోవాలి..అల్లు అర్జున్ చేస్తున్న‌ది ఇదే! త‌న‌కంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాక, మెగా ముద్ర‌ను పూర్తిగా చెరిపేసేందుకు వీలున్న దారుల‌న్నీ వెతికి ఆఖ‌రికి ఇన్ స్టాలో తేలాడు. ఇక్క‌డ ఆయ‌న ఫాలోయింగ్ పై అదేవిధంగా తాజాగా క్రియేట్ చేసిన హిస్ట‌రీ పై రికార్డుల‌పై తెలుగు చిత్ర సీమే కాదు ద‌క్షిణా భార‌తావ‌నికి చెందిన అందరు సినీ ప్ర‌ముఖుల‌కూ ఆశ్చ‌ర్యం పుడుతోంది. కొంద‌రికి అసూయ కూడా క‌లుగుతోంది.పెద్ద‌గా ఖ‌ర్చు చేయ‌కుండా త‌మ సినిమాల ప్ర‌మోష‌న్లు అన్నీ ఇన్ స్టాలో షేర్ చేసి ఇక‌పై మ‌రింత‌గా క్రేజ్ తెచ్చుకునేందుకు తాజా రికార్డు ఉప‌యోగ‌ప‌డ‌డ‌మే కాదు ఆయ‌న‌ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేయ‌నుంది కూడా!

Allu-Arjun
Allu-Arjun

పుష్ప సినిమాతో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న బ‌న్నీ..అదే జోరును ఇక‌పై కూడా కొన‌సాగించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నా డు.రానున్న చిత్రాల‌కూ అదే స్పీడులో ప‌నిచేసేందుకు క‌థ‌లు సిద్ధం చేసేలా ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్నాడు.కొత్త సినిమా సంగ‌తి ఎలా ఉన్నా అన్నింటి క‌న్నా ముందుగా పుష్ప సినిమా హ‌వాను కొన‌సాగించేందుకే ఎక్కువ ఇష్ట‌ప‌డుతున్నారు.అందుకు త‌గ్గ విధంగా ఇప్ప‌టికీ పుష్ప ప్ర‌మోష‌న్ ను చేస్తూనే ఉన్నాడు.ఏదో ఒక విధంగా  ఎక్క‌డో ఓ చోట వీలున్నంత మేర పుష్ప గురించి మాట్లాడి మ‌రింత హైప్ ను తీసుకువ‌స్తున్నాడు.

గ‌తంలో ఇలా చేయ‌లేదు కానీ ఈ సారి మాత్రం పుష్ప విష‌యంలో ఓటీటీకి కూడా క్రేజ్ మ‌రింత తెప్పించేందుకు  భ‌లే శ్ర‌ద్ధ వ‌హిస్తున్నాడు.సినిమా తీసి వ‌దిలేయ‌డం క‌న్నా ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ ను ఎవ‌రెవ్వ‌రినో వాడుకునే క‌న్నా త‌న‌కంటూ ఓ ట్రెండ్ ను త‌న ద్వారానే సెట్ చేస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమా హిట్ కావ‌డానికి మ‌రో కార‌ణం కూడా సోష‌ల్ మీడియానే! ఇందుకు సంబంధించి అల్లు అర్జున్ డిజిట‌ల్ వింగ్ బాగా క‌ష్ట‌ప‌డింది. మూవీ అప్టేడ్స్ పోస్ట‌ర్ లుక్స్ అదేవిధంగా ఇంకొన్ని మీడియా వ్యూస్ ఇలా అన్నింటినీ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్ కు చేర‌వేసింది.దీంతో పాట‌లు విడుద‌యిన వెంట‌నే మంచి హైప్ వ‌చ్చేసింది ఈ సినిమాకు.. ఇప్పుడిదే మానియాను ఇన్ స్టాలోనూ కొన‌సాగిస్తున్నాడు బ‌న్నీ.

త‌న‌కంటూ ఓ ప‌ద్ధ‌తిని అల‌వాటు చేసుకుని, ఆ పంథాకు అనుగుణంగా ప‌నిచేసుకుంటూ వెళ్తున్న బ‌న్నీ ఇన్ స్టాలో తాజాగా 15 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ను పొందారు. ఈ రికార్డు సంక్రాంతి సంద‌ర్భంగా న‌మోదు అవ్వ‌డంతో అభిమానుల ఆనందాల‌కు అవ‌ధులే లేకుండా పోతున్నాయి.కోటిన్న‌ర మంది త‌న‌ను ఫాలో అవుతుండడం త‌న అదృష్టంగానే భావిస్తున్నాన‌ని బ‌న్నీ అంటున్నాడు. ఇందుకు కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు చెల్లించాడు. ఇప్పుడీ హ‌వా ఏ హీరోకు
లేద‌ని సౌత్ కా సుల్తాన్ ఆయ‌నేన‌ని ఆనందం వ్య‌క్తం చేస్తూ అభిమానులు బ‌న్నీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.