చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలకు సంభందించి సీఎం జగన్ నిర్ణయం మేరకూ పరిశీలిస్తామని.. సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారని పేర్కొన్నారు.
ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు కేటాయించాల్సిన అవసరం వైసీపీకి లేదని.. పార్టీ కోసం పని చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు బాగా ఉపయోగపడతారో వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని వెల్లడించారు. సినీమా టిక్కెట్ల వ్యవహారాన్ని సీఎంతో చర్చించేందుకే చిరంజీవి సీఎం జగన్ ను కలిశారు..ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనతో మాట్లాడలేదన్నారు.
సినీ నటులు చిరంజీవి కూడా ఆ వార్తలను ఖండించారని గుర్తు చేశారు. కరోనా ఉదృతి నేపధ్యంలో స్వామి వారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు. కేసులు ఎన్ని పెరిగినా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతి అని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే దర్శనానికి రావాలని సూచించారు.