అరటి పండ్లు కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ..!

-

అరటి పండ్లు… ఇవి తింటానికి మధురమైన రుచిగా ఉండటమే కాక తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఈ పండు తినగానే నూతనోత్సాహం తో పాటు శక్తి కలిగి, చైతన్యవంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక అరటి పండు తీసుకోవాలి. బాగా పండిన అరటి పండు ఒకటి తీసుకున్నవారిలో 150 గ్రాముల మాంసం, అర లీటరు పాలు లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఎంత శక్తి వస్తుందో, అంత శక్తి అరటి పళ్ళ ద్వారా వస్తుంది.

జీర్ణ కోశ వ్యాధులకు అరటి మంచి ఔషధం. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే ఇక్కడ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ రోజుల్లో అరటి పండ్లను కాల్షియం కార్బైడ్ , ఏ తిలేన్, ఏ తిపాల్ అనే రసాయనాలను ఉపయోగించి పండిస్తున్నారు. ఆ పళ్లు చూడగానే మంచి పసుపు రంగులో చూడగానే ఆకర్షిస్తాయి. కానీ వీటిని తినడం వల్ల మన శరీరంలోకి కార్శినోజర్లు అనే ఎంజైములు చేరుతున్నాయి.

వీటి వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. వాంతులు, విరోచనాలు, డయేరియా వంటివి. జీర్ణ సంబంధిత వ్యాధులు అజీర్తి, అల్సర్లు, వంటివి. ఇంకా నిద్ర లేమి, మబ్బుగా వుండటం, రేచీకటి, మతి మరుపు లాంటివి వస్తాయి. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వాటికి కారకం అవుతున్నాయి. ఇలాంటి పళ్ళను తినే కన్నా తినక పోవడమే మంచిది. సహజ సిద్దంగా పండిన పళ్లు, కృత్రిమంగా పండినవి తేడాలు చూస్తే…

సహజంగా పండినవి పండు తో పాటు కొమ్మ కూడా పసుపు రంగులో ఉంటుంది. అదే రసాయనాలు ఉపయోగించి పండించినవి పండు పసుపు రంగులో, కొమ్మ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రోజుల్లో అన్ని పళ్ళు శాస్త్రీయంగా పండిస్తున్నారు. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి అరటి పళ్ళు కొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news