వాట్సాప్ మనకు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. అందుకే మనం దీనికి చాలా అలవాటు పడ్డాం. అయితే ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌తో చిక్కులు కూడా ఉన్నాయి. వాట్సాప్‌లో మొదట కేవలం సందేశాలను పంపిచేవాళ్లం. ఆ తర్వాత ఫోటోస్, ఇమేజ్, వీడియోస్ కూడా షేర్‌చేసే వెసులుబాటు కూడా లభించింది. ప్రస్తుతం వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసకుంటున్నాం. రోజూ కొత్త ఫీచర్స్ వస్తుండటంతో వినియోగదారులు వాట్సప్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకే వాట్సప్ వాడే విషయంలో ఈ తప్పులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు.
వాట్సప్‌లో పోర్న్ క్లిప్స్ షేర్ చేస్తున్నారా?
ఒకవేళ మీరు వాట్సాప్‌లో పోర్న్ క్లిప్ షేర్ చేస్తున్నట్లయితే ఇది మిమ్మల్ని జైలు వరకు తీసుకెళ్లొచ్చు. ఈ విషయంలో వాట్సప్ చాలా కఠిన నిబంధనల్ని రూపొందించింది. మీ అకౌంట్ బ్యాన్ చేసి, మీపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు.
సమాచారం షేర్ చేస్తున్నారా?
వాట్సప్‌లో వచ్చిన సమాచారాన్ని నిజమో, కాదో తెలుసుకోకుండా షేర్ చేస్తున్నారా? ఇది కూడా రిస్కే. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల హింసాత్మక ఘటనలెన్నో జరిగాయి. అందుకే ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు.
- మీకు తెలియకుండా వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేస్తున్నారా?
ఇది కూడా మీకు తలనొప్పే. ప్రైవసీ సెట్టింగ్స్‌లో మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో పర్మిషన్ ఇవ్వొచ్చు. మీకు అవసరం లేని మెసేజెస్ సేవ్ చేయకండి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌తో మీ వాట్సప్ మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలిట్ అయ్యేలా సెట్టింగ్స్ చేయొచ్చు. - కాంటక్ట్‌లో లేకుంటే డిలీట్ చేయండి
రెండుమూడేళ్ల క్రితం మిమ్మల్ని వాట్సప్‌లో కాంటాక్ట్ అయినవారితో ఇప్పుడు ఎలాంటి పని ఉండకపోవచ్చు. అలాంటి నెంబర్స్ డిలిట్ చేయండి. దీంతో మీ వాట్సప్ క్లీన్గా ఉంటుంది.
- ప్రొఫైల్ ఫోటో అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తే చాలు. ప్రైవసీ సెట్టింగ్స్‌లో మీకు Everyone, My contacts, Nobody ఆప్షన్స్
ఉంటాయి. మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ ఫోటో అందరికీ కనిపిస్తుంది. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్‌కి మాత్రమే మీ ఫోటో కనిపిస్తుంది. మూడో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ ప్రొఫైల్ ఫోటో ఎవరికీ కనిపించదు. - వాట్సప్‌లో టూ–స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయకపోవడం చాలా పెద్ద రిస్క్. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మీ వాట్సప్ అకౌంట్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. మీ సిమ్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందంటే ఈజీగా వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే టూ–స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేస్తే మీరు అదనంగా పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు.
- టచ్ , ఫేస్ ఐడీ ఉపయోగించట్లేదా? ఇది కూడా తప్పే. మీ ఫోన్ ఎవరికైనా దొరికిందంటే యాప్ ఈజీగా ఓపెన్ చేస్తారు. అందుకే టచ్ ఐడీ, ఫేస్ ఐడీ సెట్టింగ్స్ ఆన్ చేయండి.
- వాట్సప్‌లో స్టేటస్ పెట్టే అలవాటు ఉందా? ఆ స్టేటస్ అందరూ చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ వాట్సప్ స్టేటస్ మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కనిపిస్తే చాలని మీరు అనుకుంటే సెట్టింగ్స్‌లో My contacts సెలెక్ట్ చేయండి.
- వాట్సప్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌లో వాట్సప్ వాడుతున్నారా? లాగిన్ కోసం ఫేస్, ఫింగర్‌ప్రింట్ అన్లాక్ ఫీచర్ ఉపయోగించండి. ఇక మీకు వాట్సప్‌లో గుర్తుతెలియని నెంబర్స్ నుంచి స్పామ్ మెసేజెస్ వస్తున్నాయా? నెంబర్ బ్లాక్ చేసి వాట్సప్‌కి రిపోర్ట్ చేయండి.