ఇంటి వద్దకే బ్యాంకు సేవలు

Join Our Community
follow manalokam on social media

ప్రస్తుత జీవన శైలి మారింది. ప్రతి చిన్న వస్తువు నుంచి ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఇంటి వద్దనే ఉంటు సామన్లు పొందవచ్చు. అన్ని రంగాలు ఆన్‌లైన్ బాట పట్టాయి. అయితే ఇప్పటికే ఈ రంగంలోకి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సేవలను ఆన్‌లైన్‌లో పొందిన.. మరికొన్ని సేవలకు మాత్రం బ్యాంకు బాట పట్టడం తప్పేది కాదు. ప్రైవేటు బ్యాంకులు ఖాతాదారులకు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు అందించేది. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ బాట పట్టనున్నాయి.

bank
bank

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఈజ్’ సంస్కరణలతో ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించనుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇంటెగ్రా మైక్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అత్యాటి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్ల సహాయంతో బ్యాంకింగ్ సేవలు అందించనుంది. ఖాతాదారులు ప్రభుత్వ బ్యాంక్ కాల్ సెంటర్, వెబ్ పోర్టల్, మొబైల్ ద్వారా తమ సేవలను పొందవచ్చు.

దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో ఈ సేవలను త్వరలో ప్రారంభించనున్నాయి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ, చెక్కు డిపాజిట్ తదితర సేవలు ఇంటి వద్దే పొందవచ్చు. ఖాతాదారులు ఏజెంట్ల సహాయంతో ఇంటి వద్దే బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చు. డోర్ స్టెప్ బ్యాంకింగ్ పథకం ద్వారా నగదు డిపాజిట్, విత్ డ్రా, ఆర్థికేతర లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు. ఈ సేవలు కేవైసీ పూర్తి చేసుకున్న ఖాతాదారులు అర్హులు. మైనర్లు, ఉమ్మడి ఖాతాదారులకు మినహాయింపు ఇచ్చారు.

డోర్ స్టెప్ బ్యాంకింగ్ స్కీం ద్వారా ఖాతా వివరాలు, టర్మ్ డిపాజిట్ రశీదు, టీడీఎస్, ఫారం డెలివరీకి సంబంధించిన 16 సర్టిఫికెట్లు, గిఫ్ట్ కార్డులు, కొత్త చెక్కు బుక్, పే, డ్రాఫ్ట్ సేవలను పొందవచ్చు. అయితే ఈ లావాదేవీలను నిర్వహించేందుకు ఖాతాదారుడు రూ.75 సేవా రుసుము చెల్లించాలి. నగదు లావాదేవీలకు సంబంధించి కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.10,000 వరకు ఇంటి వద్దే డబ్బు పొందవచ్చు. ఈ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ సంస్థలు వెల్లడించాయి.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....