అదిరే పాలసీ.. ఒకేసారి డబ్బులు కట్టి నెల నెలా రూ.20,000 పొందొచ్చు..!

ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ కాలంలో ఎన్నో రకాల పాలసీలు కూడా మార్కెట్ లో వుంటున్నాయి. అయితే మనకి వుండే వాటిలో మంచి పాలసీని ఎంచుకోచ్చు. దీనితో చక్కగా అదిరే లాభాలను సొంతం చేసుకోచ్చు.

LIC
LIC

మీ అవసరాన్ని బట్టి మీ యొక్క పాలసీని ఎంచుకోచ్చు. అయితే దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా రంగ కంపెనీ ఎల్‌ఐసీ కూడా అదిరే పాలసీలు ఇస్తోంది. వీటి వలన కూడా చక్కగా లాభాలని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలని ఇస్తోంది. వాటిలో జీవన్ అక్షయ్ పాలసీ కూడా ఒకటి.

ఈ పాలసీని తీసుకుంటే మంచిగా లాభాలు పొందొచ్చు. ఇది పెన్షన్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందే ఆప్షన్ ఇందులో ఉంటుంది. దానిలో మీకు నచ్చినది మీరు సెలెక్ట్ చేసుకోచ్చు. ఇన్వెస్ట్ చేసే మొత్తం పెరిగే కొద్ది మీకు వచ్చే పెన్షన్ కూడా పెరగొచ్చు.

అదే విధంగా మీరు ఎప్పటి నుంచి పెన్షన్ పొందాలని భావిస్తున్నారో ఆ కాలం ప్రాతిపదికన కూడా పెన్షన్ మారుతుంది. ఇందులో ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. లిమిట్ ఏమి లేదు. కనీసం రూ.లక్ష మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 30 నుంచి 85 ఏళ్లలోపు వాళ్ళు ఈ పాలసీకి అర్హులు. పది రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

ఇక ఎంత పొందొచ్చు అనేది చూస్తే.. 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకి రూ.20 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. అదే రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నెలకు రూ.5 వేల దాక వస్తాయి. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే డబ్బులు తిరిగి రావు.