LIC: ఇలా చేస్తే ప్రతీ నెలా నాలుగు వేల రూపాయిలు పొందొచ్చు…!

-

మీరు డబ్బులేమీ వెనకేసుకోలేదా…? రిటైర్మెంట్‌ ప్లాన్ కూడా ఏమి లేదా..? అయినా కూడా మీరు ఎటువంటి చింతా పడక్కర్లేదు. మీకోసం ఇప్పుడు ఒక LIC పాలసీ వుంది. దాని వలన మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. పైగా మీకు ఆర్ధిక ఇబ్బందులు కూడా వుండవు. ఒకసారి డబ్బులు చెల్లిస్తే చాలు నెల నెలా మీకు పెన్షన్ కింద డబ్బులు వస్తాయి.

మరి LIC అందించే ఆ పాలసీకి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..ఈ పాలసీ పేరు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ ప్లాన్. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ప్రతి నెలా రూ.4 వేలు పొందొచ్చు. దీని కోసం మీరు చెయ్యాల్సిందే ఏమిటంటే..? ఒక్కసారి ప్రీమియం డబ్బులు చెల్లించడమే. ఇక ఏమి చూడక్కర్లేదు.

దీనిలో మీరు కనీసం రూ.లక్ష నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. దీనిని మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా కూడా మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. 30 నుంచి 85 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అంతే కాకుండా పాలసీ పై లోన్ కూడా పొందొచ్చు.

మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు దాదాపు రూ.1000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు రూ.4 వేలు పెన్షన్ పొందాలని అనుకుంటే అప్పుడు మీరు రూ.8 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. జీవన్ అక్షయ పాలసీలో చాలా ఆప్షన్లు అందుబాటు లో ఉన్నా కూడా వెంటనే పెన్షన్ పొందాలని భావించే వారు లైఫ్ టైమ్ ఇమ్మీడియట్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news