కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది. రోజూ రెండులక్షలకి పైగా కేసులు వస్తుండడం అందోళనకి గురి చేస్తుంది. గత ఐదు రోజులుగా కేసుల సంఖ్యలో రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తుంటే ప్రతీ ఒక్కరిలో భయం కలుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటకి రావద్దని, కరోనా జాగ్రత్తలు అన్నీ పాటించాలని మరోమారు నొక్కి చెబుతున్నారు.
సెకండ్ వేవ్ కరోనా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. మీపిల్లలు కరోనా బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకి పాఠశాలలు లేవు కాబట్టి, ఇంట్లో గడుపుతూ సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. పిల్లలకి ఎక్కువ సేపు సెల్ ఫోన్ ఇవ్వకండి. మొబైల్ నుండి వచ్చే నీలికాంతి పిల్లల్లో ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. కరోనా టైమ్ లో ఇమ్యూనిటీ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇమ్యూనిటీ పెంచేందుకు సిట్రస్ ఫలాలైన నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి మొదలగునవి ఆహారంగా ఇవ్వాలి. ఇంకా క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, ఆకుకూరలు, పెరుగును ఖచ్చితంగా అందించాలి. ఆహారంతో పాటు కావాల్సినంత నిద్ర కూడా అవసరం. కనీసం 10గంటల పాటు నిద్రపోయేలా చూడండి. నిద్రలేకపోతే అది ఇమ్యూనిటీ మీద ప్రభావం చూపిస్తుంది. పై జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకునేలా, శానిటైజర్ వాడేలా తల్లిదండ్రులు చెప్పాలి.