వాటే పాలసీ.. రూ.150 పొదుపు చేస్తే చేతికి రూ.20 లక్షలు పొందొచ్చు..!

-

మీరు ఏదైనా మంచి పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల పాలసీలని ఇస్తోంది. వీటి వలన ఎన్నో లాభాలు ఉంటాయి. జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటుంది. దీని వలన చాల లాభాలు వున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

lic
lic

16 ఏళ్లు లేదా 21 ఏళ్లు లేదా 25 ఏళ్ల కాల పరిమితితో మీరు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు కనుక 16 ఏళ్ల ఆప్షన్ ఎంచుకుంటే 10 ఏళ్లు ప్రీమియం కట్టాలి. అదే ఒక వేళ 21 ఏళ్లు అయితే 15 ఏళ్లు, 25 ఏళ్లు అయితే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి.

ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే.. పాలసీ డబ్బులు నామినీకి చెందుతాయి. ఇక ఎలా డబ్బులు వస్తాయి అనేది చూస్తే… ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి 21 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకుంటే అప్పుడు 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

అదే రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే రోజుకు రూ.150 ఆదా చేసి నెలకు దాదాపు రూ.4500 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇలా మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.20 లక్షలు వస్తాయి. దీనిలో బీమా మొత్తం రూ.10 లక్షలు, బోనస్ రూ.10 లక్షలు, ఎఫ్ఏ‌బీ రూ.లక్ష కలిసి ఉంటాయి. పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news