కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి బిగ్ సర్‌ప్రైజ్.. ఎంత జీతం పెరగనుందంటే..?

-

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఇటీవల వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. ఇప్పుడు మరోసారి ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీకి ముందే బిగ్ సర్ ప్రైజ్ ను ఇస్తూ భారీగా జీతాలను పెంచింది..కరువు భత్యం పెంపునకు మోదీ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ ఆమోదం తర్వాత ఉద్యోగుల జీతం రూ.27 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుండగా.. ఇప్పుడు అది 4 శాతానికి పెరగనుందని సమాచారం..

ఎంత జీతం పెరిగిందంటే..ఉదాహరణకు ఉద్యోగి బేసిక శాలరీ రూ.18 వేలు అయితే.. అతని జీతంలో నెలకు రూ.720 పెరుగుతుంది. ఉద్యోగుల జీతంలో ఏడాదికి రూ.8640 పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్ వేతనం నెలకు రూ.56900 ఉంటే.. వారి జీతం నెలకు రూ.2276 పెరగనుంది. అంటే వార్షిక ప్రాతిపదికన రూ.27,312 పెరుగుతుంది.. ఈ జీతం పెంపుపై త్వరలోనే ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది..

ఇకపోతే హోలీ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. మార్చి నెల జీతంతో పాటు పెంచిన డియర్‌నెస్ అలవెన్స్ కూడా చెల్లించాలి. ఉద్యోగులకు రెండు నెలల బకాయిలు కూడా అందుతాయి. అంటే జనవరి నెల నుంచి పెరిగిన డీఏ అమలవుతుంది.అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. దీనిని 3.68 శాతానికి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేరిస్తే బేసికి శాలరీ రూ.18 వేల నుంచి రూ.26 వేలు అవుతుంది.. అంటే శాలరీ డబుల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news