పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! రోజూ రూ.300 ఆదా చేస్తే కోటి వరకు పొందొచ్చు…

పోస్టాఫీస్‌లో మీకు ఎకౌంట్ వుందా…? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల సేవింగ్ స్కీమ్స్ వున్నాయి. వీటి వలన మంచి లాభాలు పొందొచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్‌ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పీపీఎఫ్ కూడా ఒకటి వుంది. రిటైర్మెంట్ స్కీమ్స్‌ లో ఇది కూడా ఒకటి. పైగా పన్ను మినహాయింపు తో పాటు అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే…

మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ పీపీఎఫ్ స్కీమ్‌ పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది గమనించండి.

ప్రతి త్రైమాసికం వడ్డీ రేట్లను పెంచొచ్చు. లేదంటే తగ్గించొచ్చు. లేదు అంటే అలానే వుంది పోవచ్చు కూడా. పీపీఎఫ్ స్కీమ్‌ లో డబ్బులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం పొందొచ్చు.

మీరు రోజుకు రూ.300 ఆదా చేసి.. నెల చివరిలో రూ.9 వేలను పీపీఎఫ్ అకౌంట్‌ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మీరు 30 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు. పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అయితే అవసరం అనుకుంటే ఈ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. ఇలా లాభాలు మీరు పొందొచ్చు.