ఇకపై కార్డు లేకున్నా “ఫింగర్‌ప్రింట్‌” ద్వారా ఏటీఎం నుండి మ‌నీ తీసుకోవచ్చు!

-

ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసే వారందరు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే ఇకమీదట డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అది కూడా ఫింగర్‌ ప్రింట్ ద్వారానే డబ్బులు పొందొచ్చు. ఇదే ఆధార్ ఏటీఎం సర్వీసులు. టెక్నాలజీ వినియోగంతో ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కూడా కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్త సాంకేతికతతో ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు సరికొత్తగా టెక్నాలజీ కారణంగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు కూడా మరింత సులభతరం అయ్యాయి.

మాములుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే డెబిట్ కార్డు కచ్చితంగా ఉండి తీరాలి. డెబిట్ కార్డు పెట్టి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే డబ్బులు విత్ డ్రా చేసుకోగలం. అయితే కొన్ని బ్యాంకులు కార్డ్ ‌లెస్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సర్వీసులు అందిస్తు్న్నాయి. ఇందులో డెబిట్ కార్డు లేకుండా, కార్డు పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ దీనికి మొబైల్ ఫోన్ ఉండాలి. అయితే ఇప్పుడు మరో కొత్త రకం సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని అందరు తెలుసుకోవాలి. ఏటీఎం కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ అవసరం లేకుండా కూడా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే సేవలు అందిస్తోంది డీసీబీ బ్యాంక్ . డెబిట్ కార్డు లేకున్నా పర్లేదు, ఫింగర్‌ప్రింట్‌ సహాయంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.

డీసీబీ బ్యాంక్ ఏటీఎంలలో ఆధార్ ఆధారిత అథంటికేషన్ ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ బ్యాంకు. అయితే ఇక్కడ ఈ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావించేవారు వారి బ్యాంక్ అకౌంట్ కి వాళ్ళ ఆధార్ నెంబర్ ‌తో కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. దాంతో ఫింగర్‌ ప్రింట్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకు ఆధార్ నెంబర్ పిన్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news