కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్… వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

కేంద్ర ప్రభుత్వం సురక్ష బీమా యోజన స్కీమ్ అందిస్తోంది. దీని వలన బెనిఫిట్ ఎక్కువగా ఉంది. దీని కోసం మీరు కేవలం ఏడాదికి రూ.12 కట్టిన చాలు. కుటుంబానికి రూ.2 లక్షలు లభిస్తాయి. అయితే మరి ఈ అదిరిపోయే స్కీమ్ గురించి వివరాలు ఇప్పుడే చూసేయండి. పూర్తి వివరాల లోకి వెళితే… ఏడాదికి రూ.12 కడితే…కుటుంబానికి రూ.2 లక్షలు వస్తాయి. పాలసీదారుడికి ఏమైనా జరిగి మరణిస్తేనే ఈ డబ్బులు కుటుంబానికి వస్తాయి గుర్తుంచుకోండి.

కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తున్న సంగతి మనకి తెలిసినదే. ఇందులో సామాజిక ఆర్థిక భద్రత కల్పించే పథకాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాటిలో చేరడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటా అంటే..? కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఇలాంటి స్కీమ్స్‌లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఇక సురక్ష బీమా యోజన చూస్తే… ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీని ప్రత్యేకత తక్కువ ప్రీమియం. ఈ పాలసీలో మీరు చేరాలంటే ఇది జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంది. దీనిలో చేరాక ఏడాదికి రూ.12 చెల్లించాలి. నెలకి ఒక రూపాయి అన్న మాట.

ఇవి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయిపోతాయి. సురక్ష బీమా యోజన స్కీమ్‌లో ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల వరకు డబ్బులు లభిస్తాయి. అలానే పాక్షికంగా అంగ వైకల్యం వస్తే రూ.1 లక్ష వరకు వస్తాయి. అదే శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు లభిస్తాయి. ఈ పాలసీలో చేరాలనుకునే వాళ్ళు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి. ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌ లో చేరొచ్చు.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...