ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వాలు కొన్ని మార్పులు తీసుకొస్తున్నాయి. వాటిల్లో 4 ప్రధాన మార్పులు ఉన్నాయి. పెద్ద పెద్ద మార్పులు కాదు గాని చిన్న చిన్న మార్పులే గాని మీరు కచ్చిత౦గా తెలుసుకునే మార్పులు అవి. అవి ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ అమలులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి రానున్న ఈ నిబంధనలు యులిప్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు వర్తిస్తాయి. కొత్తగా పాలసీ తీసుకునే వాళ్ళు ఈ రూల్స్ తప్పక తెలుసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. స్పందన కార్యక్రమంపై జరిగిన రివ్యూ మీటింగ్ లో ఈ ప్రకటన చేసారు జగన్.
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఫిబ్రవరి 1 నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారికి వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఆండ్రాయిడ్ 2.3.7, దీని కన్నా ముందు వెర్షన్, ఐఓఎస్ 8, అంతకన్నా ముందు వెర్షన్లలో నడుస్తున్న ఫోన్లతోపాటు అన్ని విండోస్ ఫోన్లలోనూ ఆగిపోతుంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) చార్జీలను తొలగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. జనవరి 31లోపు భీమ్ యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్, రూపే డెబిట్ కార్డు చెల్లింపుల వ్యవస్థలను కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని కీలక సూచనలు చేసింది. లేకపోతే మాత్రం ఫిబ్రవరి 1 నుంచి రోజుకు రూ.5,000 జరిమానా పడుతుందని హెచ్చరించింది.