ఈ సెట్టింగ్స్‌ మారిస్తే మీ గూగుల్‌ ఖాతా సేఫ్‌!

-

ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ వినియోగదారులతో పాటు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు కూడా గూగుల్‌ ( Google ) ఖాతా తప్పనిసరి. అయితే. మీ గూగుల్‌ అకౌంట్‌ ఎంత వరకు సేఫ్‌గా ఉంది?దానికి మీరేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అకౌంట్‌ క్రియేట్‌ చేసి వాడుకోవడం తప్ప ఇతర భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, మీ గూగుల్‌ అకౌంట్‌ని సేఫ్‌గా, సెక్యూర్‌గా మార్చేందుకు గూగుల్‌ చాలా సెట్టింగ్స్‌ అందిస్తోంది. అవి తెలియని వారు చాలామంది. అందుకే దీన్ని ఉపయోగించేవారు తక్కువ. స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్, 2 స్టెప్‌ వెరిఫికేషన్‌ లాంటి వాటి ద్వారా మీ గూగుల్‌ అకౌంట్‌ను సురక్షితంగా మార్చుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Google | గూగుల్‌
Google | గూగుల్‌

సాధారణంగా యూజర్లు పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేయడానికి తమ పుట్టినరోజు, ఫోన్‌ నంబర్లు వంటివి పెట్టుకుంటారు. కానీ, అది తప్పు ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇటువంటివి సులభంగా హ్యాక్‌ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరూ గుర్తించని స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేయాలి. అప్పర్‌ కేస్, లోయర్‌ కేస్, నెంబర్, స్పెషల్‌ క్యారెక్టర్‌ కలిపి పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేస్తే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ని గుర్తించి మీ అకౌంట్‌ హ్యాక్‌ చేయడం కష్టమే. ఇక గూగుల్‌ అకౌంట్‌లో 2 స్టెప్‌ వెరిఫికేషన్‌ సెట్టింగ్స్‌ చేయడం కూడా ముఖ్యమే. మీ ఖాతాకు ఇది అదనపు సెక్యూరిటీ లేయర్‌గా పనిచేస్తుంది.

  • మీ స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో https://myaccount.google.com/వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
  • మీ గూగుల్‌ అకౌంట్‌ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
  • హోమ్‌ పేజీలో ఎడమవైపు సెక్యూరిటీ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత గూగుల్‌ సైన్‌ ఇన్‌ అవ్వాలి. మళ్లీ మీ పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
  • ఆ తర్వాత 2 step verifivation ఆన్‌ చేయాలి.
  • మళ్లీ మీ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి 2 step verification పూర్తి చేయాలి.
  • చివరగా మీ ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత నెక్స్‌›్ట క్లిక్‌ చేస్తే 2 స్టెప్‌ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news