బ్రేకింగ్‌ : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌…

-

హైదరాబాద్‌ : ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్‌ విగ్రహం వైపు ర్యాలీగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బయలు దేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇందిరా పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నాచౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యకర్తల భుజాలపై ఎక్కి మరీ రేవంత్‌ రెడ్డి బారికేడ్లు దాటారు.

అటు బారికేడ్లను కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలు తోసివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో పాటు…మధు యాష్కీ మరియు అంజన్ కుమార్‌ యాదవ్‌ లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అంతకు ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్, కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. గవర్నర్ అపాయింట్‌ మెంట్‌ అడిగితే ఇవ్వలేదని… నిన్ను ఏమన్నా భోజనం పెట్టమని అన్నమా…? అని ప్రశ్నించారు. గవర్నర్, మోడీ, కెసిఆర్ మీద నమ్మకం లేదని… మాకు అంబేడ్కర్ మీద నమ్మకం ఉందన్నారు.  అంబేద్కర్ బొమ్మకి వినతి పత్రం ఇచ్చి పోతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news