పాన్ కార్డుని పిల్లలు కూడా తీసుకోవచ్చు.. ఎలా అంటే..?

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. ఎన్నో వాటికి ఇది ప్రూఫ్ గా పని చేస్తుంది. 18 రకాల లావాదేవీలు జరిపినప్పుడు పాన్ కార్డ్ డాక్యుమెంట్ ని తప్పక సబ్మిట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ అంది.

అయితే ఈ కార్డు ని 10 నిమిషాల్లో తీసుకో వచ్చు. అయితే పిల్లలు కూడా పాన్ కార్డుని తీసుకొచ్చు. మరి దీని కోసం పూర్తిగా చూస్తే.. పిల్లల పేర్ల మీదా ఆస్తులను మెయింటైన్ చేసేవారు కూడా వుంటారు. అలానే వాళ్లకి అకౌంట్ ని ఓపెన్ చేస్తారు.

కనుక 18 ఏళ్ల లోపు వారు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మైనర్లు పాన్ కార్డ్ కోసం స్వయంగా దరఖాస్తు చేయకూడదు. వారి తల్లిదండ్రులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటినవారు మాత్రమే కాదు… 18 ఏళ్ల లోపు మైనర్ల తరఫున వారి తల్లిదండ్రులు పాన్ కార్డుకు అప్లై చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

అధికారిక వెబ్‌సైట్ https://www.tin-nsdl.com/ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ Services లో PAN పైన క్లిక్ చేయాలి.
Application for allotment of New PAN (Form 49A) సెక్షన్‌లో Apply పైన క్లిక్ చేయాలి.
పాన్‌కార్డ్ తీసుకోవాలనుకునే పిల్లల వివరాలతో పాటు తల్లిదండ్రుల వివరాలు ఇవ్వాలి. తల్లిదండ్రుల ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
అదే విధంగా కొన్ని ప్రూఫ్స్ అవసరం అవుతాయి.
ఏదైనా ఓ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.
రూ.107 చెల్లించి ఫామ్ సబ్మిట్ చేయాలి.
15 రోజుల్లో పాన్ కార్డ్ పోస్టులో వస్తుంది.