ఢిల్లో తగ్గని వాయు కాలుష్యం… ప్రమాదకరంగానే గాలి నాణ్యత.

-

ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా.. ఫలితాలు కనిపించడం లేదు. శనివారం రోజు కూడా ఢిల్లీలో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ ’వెరీ పూర్‘ కేటగిరీలోనే ఉంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ 332 నుంచి 355కు చేరుకుంది. ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్ట్ కూడా ఆందోళనను వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాహనాల రద్దీతో పాటు సమీప రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్ లలో పంట వ్యర్థాలు తగలబెడుతుండటంతో కాలుష్యం పెరగుతోంది.

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వందశాతం వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. భవనాల కూల్చివేతను, నిర్మాణాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈచర్యల ద్వారా వాహనాల రద్దీని తగ్గించవచ్చిన సర్కార్ భావిస్తోంది. ఢిల్లీకి వచ్చే వాహనాలను నిషేధించారు. కేవలం నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news