ఏడాదంతా గుర్తుండిపోయేలా మెమరీస్ ని జనవరిలోనే క్రియేట్ చేసేసుకోండి.. ఈ ఉత్సవాలతో భలే..!

-

ఈ కొత్త సంవత్సరాన్ని మీరు కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నారా..? జనవరిలో చేసే ఎంజాయ్మెంట్ సంవత్సరమంతా ఉండిపోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక ఈ ప్రదేశాలని సందర్శించాలి. 2023 జనవరిలో ఆస్వాదించగలిగే ఆసక్తికరమైనవి చాలా ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు చూసేసి ప్లాన్ చేసుకోండి. వీటన్ని కనుక మీరు ఎంజాయ్ చేశారంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది పైగా ఎప్పటికీ 2023 ని మీరు మర్చిపోలేరు.

గోవా పర్పుల్ ఫెస్ట్

ఇక్కడ ఆకట్టుకునే ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం గోవా లో మొదటిసారి పర్పుల్ ఫెస్ట్ జరగనుంది. వైకల్యాలున్న వాళ్ళు పాల్గొనొచ్చు. 2023 జనవరి 6-8 వరకు పనాజీలో ఇది జరగనుంది.

మనాలి వింటర్ కార్నివాల్

మనాలి లో వార్షిక వింటర్ కార్నివాల్ జరుగుతుంది. స్కీయింగ్, పారాగ్లైడింగ్‌తో వంటి ఈవెంట్స్ వుండనున్నాయి. జనవరి రెండు నుండి ఆరు దాకా నిర్వహిస్తున్నారు.

రాజస్థాన్‌ క్యామెల్ ఫెస్టివల్

రాజస్థాన్‌లోని బికనీర్‌లో క్యామెల్ ఫెస్టివల్ జరగనుంది. సాంస్కృతిక పండుగ. ఒంటెలని అందంగా అలంకరిస్తారు. జనవరి 11,12 తేదీల్లో ఇది జరగనుంది. జానపద కళలు, ఫైర్ షోలు కూడా ఉంటాయి.

అస్సాం దేహింగ్ పాట్కాయ్ ఫెస్టివల్

జనవరి 16 నుండి 19 వరకు అస్సాంలో దేహింగ్ పాట్కాయ్ ఫెస్టివల్ జరుగుతుంది. గిరిజన ఉత్సవాలు, టీ హెరిటేజ్ పర్యటనలు వంటివి జరుగుతూ ఉంటాయి.

హంపీ ఉత్సవాలు

కర్ణాటక హంపీలో జనవరి 27 నుండి 29 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news