డీ–మార్ట్‌ లాభం ఎన్నికోట్లు తెలుసా..?

-

ఈ ఆర్థిక సంవత్సరం మూడో తెమాసికం(అక్టోబరు–డిసెంబరు)లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 16.39 శాతానికి పెరిగింది. కన్సాలిడేట్‌ ఖాతాలను చూసుకుంటే నికర లాభం రూ.446.95 కోట్లు నమోదైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సమయంలో రూ.384.10 కోట్ల లాభం వచ్చింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే డిమార్ట్‌ రిటైల్‌ స్టోర్లు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ మొత్తం ఆదాయం 10.77% పెరిగి రూ.7,542 కోట్లకు చేరింది. అయితే.. గతేడాది ఇదే సమయంలో రూ.6,808.93 కోట్లు ఉండేది. ఖర్చులు సైతం 10.32 % పెరిగి రూ.6325.03 – 6,997.88 కోట్లకు చేరాయి. స్టాండలోన్‌ పద్ధతిన కంపెనీ నికరలాభం 19.27% శాతం పెరిగి రూ.470.25 కోట్లకు చేరగా ఆదాయం మాత్రం రూ.7432.69 కోట్లకు చేరింది.

 

కలిసొచ్చిన పండగలు..

కరోనాకు ముందున్న స్థాయి అమ్మకాలకు సమీపంలో ఉన్నట్లు్ల అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సీఈఓ, నెవిల్లె నొరానా పేర్కొన్నారు. పండగలు, వేడుకలు కలిసొచ్చినట్లు ఆయన వెల్లడించారు. వస్త్రాలు, చెప్పులు, షూ, బ్యాగ్‌లు, ప్రయాణ లగేజీలకు సంబంధించిన సామగ్రి, చిన్నచిన్న వాటి కొనుగోళ్లకు ఇంకాస్త సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. గత రెండేళ్లుగా క్రయవిక్రయాలు కొనసాగిస్తున్న అన్ని డిమార్ట్‌ స్టోర్లలో గతేడాది డిసెంబరు విక్రయాల్లో దాదాపుగా 96 శాతాన్ని ఈ డిసెంబరులో నమోదు చేసినట్లు చేసినట్లు నెవిల్లె నొరానా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news