ఈరోజు ఈ బ్యాంక్ లో డబ్బులు పెడితే అదిరే లాభం పొందొచ్చు..!

మీరు మీ డబ్బులని బ్యాంక్ లో దాచుకోవాలని అనుకుంటున్నారా…? ఎక్కువ లాభం పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇలా డబ్బులు పెడితే అదిరే లాభం పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఒక బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. ఆగస్ట్ 16వ తేదీలోపు ఎఫ్‌డీ తెరిచిన వారికే ఈ ప్రయోజనం లభిస్తుందని బ్యాంక్ చెప్పడం జరిగింది. డీసీబీ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 345 బ్రాంచులు ఉన్నాయి.

డబ్బులు
డబ్బులు

డీసీబీ బ్యాంక్ కస్టమర్లకు ఎఫ్‌డీలపై అధిక రాబడి అందిస్తోంది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 7.11 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డబ్బులు ఎఫ్‌డీ చేయాలని భావించే వారు ఈజీగా ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యచ్చు. డబ్బులు ఎఫ్‌డీ చేయాలని భావించే వారు ఆన్‌లైన్‌ లోనే బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేయొచ్చు.

ఇలా అదిరే లాభాలు పొందొచ్చు. అయితే బ్యాంక్‌ లో సేవింగ్స్ ఖాతా లేక పోయినా డీసీబీ బ్యాంక్ జిప్పి ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ లో చేరొచ్చు. కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులను ఆన్‌లైన్‌లో కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.