వీలునామా రాసేటప్పుడు వీటిని మరచిపోకండి..!

-

సాధారణంగా పెద్దవాళ్ళు వీలునామాకి రాయడం మనం చూస్తూ ఉంటాం. అయితే అసలు వీలునామా అంటే ఏమిటి..?, ఎలా రాయాలి..?, ఏ తప్పులు చెయ్యకూడదు..? ఇలా ఎన్నో విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. త‌మపై ఆధార‌ప‌డిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాల‌నే ఉద్దేశంతో సంపాదించుకున్న స్వార్జితాన్ని చట్టబద్దంగా పంచివ్వ‌డానికి ఇది అవసరం.

 

మ‌ర‌ణానికి ముందు వ్యక్తులు రాసే లీగల్ డాక్యుమెంట్‌ను వీలునామా అంటారు. దీనిని క్లియర్ గా రాస్తే వివాదాలు రావు. వీలునామాని రాసేవారిని ‘టెస్టేట‌ర్’ అంటారు. వ్యక్తుల వారసుల మధ్య వివాదాలను నివారించాలంటే టెస్టేట‌ర్‌ విలునామాను మంచిగా రాయాలి. ముందుగా అన్నింటి కంటే ముఖ్యమైనది భాష. వీలునామా రాసే భాష టెస్టేట‌ర్‌కి తెలిసిన‌, అర్థం చేసుకోగ‌లిగిన భాష అయి ఉండాలి.

ఒక‌వేళ‌ వేరే భాష‌లో రాస్తే.. ఆ వీలునామాను పూర్తిగా చ‌దివి వినిపించ‌డానికి, దాన్ని అర్థం చేసుకోవ‌డానికి టెస్టేట‌ర్ నమ్మకమైన వ్యక్తి సహాయం తీసుకుని.. స‌హాయం తీసుకున్నార‌ని వీలునామాలో ప్ర‌స్తావించాలి. అలానే ఇది ఆఖరి వీలునామా అని కూడా చెప్పాలి. ఒక‌వేళ టెస్టేట‌ర్ త‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికైనా త‌న ఆస్తిని కానీ, అందులో భాగం కానీ ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకుంటే.. ఎవ‌రికి వాటా ఇవ్వ‌కూడ‌దు అనుకుంటున్నారనే వారి వివరాలని వ్రాయాల్సి ఉంటుంది.

అదే విధంగా వీలునామాలో సంత‌కం చేసే సమ‌యానికి టెస్టేట‌ర్‌కు ఉన్న అప్పులు, చెల్లింపుల‌ను అందులో ప్ర‌స్తావించాలి. అలాగే భ‌విష్య‌త్తులో నిర్థారించ‌ద‌గిన అప్పులు, చెల్లింపులు, వాటిని ఎలా తీర్చాలో కూడా రాయాలి. ప్ర‌తి విలునామాలో కార్య‌నిర్వాహ‌కుల పేరును ప్ర‌స్తావించాలి. లేక‌పోతే ల‌బ్ధిదారునికి ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. ఇలా వీలునామాని రాసేటప్పుడు కచ్చితంగా అన్నింటినీ ఫాలో అవ్వాలి. లేదు అంటే ఇబ్బందులు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news