వేగంగా రుణం పొందాలని అనుకుంటే ఇలా చెయ్యండి…!

Join Our Community
follow manalokam on social media

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అది కూడా వేగంగా, ఈజీగా తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇలా చెయ్యచ్చు. దీని వలన లోన్ మీకు ఈజీగా వస్తుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… ఇప్పుడు మీరు పేటీఎం ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

దీని వలన వేగంగా రుణాన్ని మీరు పొందొచ్చు. అయితే దీని కోసం మీరు పేటీఎం కస్టమర్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు పేటీఎం ఉపయోగిస్తూ ఉంటే వెంటనే రెండు లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. అయితే ఇక ఎలా తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే.. పేటీఎం కొన్ని నెలల కిందట ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీసులు అందుబాటు లోకి తీసుకు వచ్చింది.

అయితే వీటిలో భాగంగా మీరు వేగం గానే లోన్ పొందొచ్చు. పేటీఎం లోన్ సర్వీసుల కోసం ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల తో జతకట్టిన సంగతి తెలిసినదే. పేటీఎం ద్వారా ఉద్యోగం చేసే వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, బిజినెస్ చేసే వారు లోన్ పొందొచ్చు. రూ.2 లక్షల వరకు రుణం వస్తుంది.

ఆన్‌లైన్ ‌లోనే క్రెడిట్ స్కోర్ బాగుంటేనే లోన్ వస్తుంది. రుణాన్ని 18 నుంచి 36 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం యాప్‌లో ఉన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్ ‌లోకి వెళ్లాలి. అక్కడ పర్సనల్ లోన్ ట్యాబ్ ఉంటుంది. అక్కడ అర్హత ఉంటే లోన్ వస్తుంది.

 

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...