బ్రేకింగ్: టీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభా పక్షం విలీనం

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే గులాబీ గూటికి చేరారు. ఎమ్మెల్యే మెచ్చా టీడీపీ నుంచి గెలిచిన పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. ఇప్పుడు ఆయన కూడ టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో టీఆర్ఎస్ లో టీడీపీ విలీనానికి మార్గం సుగమమైంది.


గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా గులాబీ గాలి వీచినా ఖమ్మంలో మాత్రం రెండు సీట్లు గెలుచుకుంది టీడీపీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట,సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్దులు మెచ్చా నాగేశ్వరరావు,సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. పార్టీ మారిన వీరిద్దరు పిరాయింపుల చట్టం వర్తించకుండా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి విలీనం లేఖ అందించారు. విలీనం పూర్తికావడంతో స్పీకర్ కార్యాలయం నుంచి టీఆర్ఎస్ లో టీడీపీ విలీనం పై బులిటెన్ విడుదల కానుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...