ఆధార్‌ కార్డు పోయి, ఆ నంబర్‌ కూడా తెలియకుంటే ఎలా తిరిగి పొందాలో తెలుసా.?

-

ఆధార్‌.. ఈరోజుల్లో నిత్యవసరమైన కార్డు. ఆధార్‌ ఉపయోగం ఎంత ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. అలాంటి కార్డు మీరు ఒకవేళ పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటంటారు..! నంబర్‌ గుర్తుంటే కాస్త తేలికగానే పనవుతుంది..కానీ కొందరికి ఆ నంబర్‌ కూడా గుర్తుండదు..ఇంకేంచేస్తాం.. ఏముంది తిన్నగా ఆధార్‌ సెంటర్‌కి పోవటమే. ఒకప్పుడు అంటే ఆధార్ సెంటర్లు కాళీగానే ఉండేవి. కానీ ఇప్పుడు కరోనా వల్ల లిమిటెడ్‌ టైం మాత్రమే ఉండటంతో అన్నీ ఆన్‌లైన్‌ సెంటర్లు బిజీ బిజీగా ఉంటున్నాయ్..ఆధార్‌కి ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేసుకోవటానికే ఆధార్‌ కేంద్రాల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇంకా ఏకంగా కార్డే పోయిదంటే అబ్బో పెద్ద ప్రాసేస్‌ అని తిప్పినా ఆశ్యర్యపోనక్కర్లేదు..మీకెందుకు అంత శ్రమ..ఇంట్లో ఉండే ప్రాసెస్‌ ఎలా నడిపించాలో ఈరోజు చూసేద్దాం. అదే ఆధార్‌. పోతే ఆన్‌లైన్‌ ద్వారా ఎలా తిరిగి పొందలో తెలుసుకుందాం. ఆధార్‌ తిరిగి పొందాలంటే..మీ ఫోన్‌ నంబర్‌ UIDAI కి లింక్‌ చేసి ఉండాలి. ఆ ఫోన్‌ నంబర్‌కి మెసేజ్‌ యాక్టీవ్‌లో ఉండాలి.

ఇప్పుడు పోయిన ఆధార్ కార్డ్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా తిరిగి పొందాలో తెలుసుకుందాం.

1. ముందుగా UIDAI పోర్టల్‌కి వెళ్లండి – మీ బ్రౌజర్‌లో https://resident.uidai.gov.in/ క్లిక్ చేయండి

2. కిందకు స్క్రోల్‌ చేస్తే ‘ఆధార్ సేవలు ’ కనిపిస్తాయి.

3. ‘రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ EID/UID’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

4. అప్పుడు నెక్స్ట్ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో “ఆధార్‌ నో” ఆప్షన్‌ క్లిక్‌ చేయండి

5. పేరు, మీ నమోదిత మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ID వంటి మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్‌ చేయండి

6. ఒక కాప్చా వస్తుంది. అది ఉన్నది ఉన్నట్లు ఎంటర్‌ చేయండి

7 ‘Send OTP’పై క్లిక్ చేయండి, ఇది మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDకి ఆరు అంకెల OTP వస్తుంది.

8. పోర్టల్‌లో ఆరు అంకెల OTPని ఎంటర్‌ చేయండి

ఇక్కడితో పని పూర్తవుతుంది.

ఆధార్ కార్డ్ ఇ-కాపీని ఆన్‌లైన్‌లో తీసుకోవాలంటే

పైన చేసిన ప్రాసేస్‌తో మీ ఆధార్ నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కి వస్తుంది. మీరు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను పొందిన తర్వాత, మీరు దాని ఇ-కాపీని కూడా ప్రింట్ చేయవచ్చు. ఎలా అంటే.

UIDAI పోర్టల్‌ కి వెళ్లి ఆధార్‌ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయండి .
అక్కడ మీరు మీ ఆధార్ నంబర్, అవసరమైన క్యాప్చా వివరాలను ఎంటర్‌ చేస్తే మునుపటి ప్రక్రియ మాదిరిగానే OTP వస్తుంది.
ఓటీపీ ఎంటర్‌ చేశాక..రెండు ప్రశ్నలు ఉంటాయి. అందులో అవును అని ఒకదానికి ఇంకోదానికి ఆరు నుంచి పది రోజులు ఇలా ఏదో ఒక ఆప్షన్‌ క్లిక్‌ చేయండి
అనంతరం వెరిఫై అండ్‌ డౌన్‌లోడ్‌ ఆధార్‌ బటన్‌ క్లిక్‌ చేయండి
అంతే మళ్లీ మీ ఆధార్‌ వచ్చేస్తుంది.
దానికి ఒక పాస్‌వార్డ్‌ ఉంటుంది..అది మీరు ఇంటిపేరులో మొదటి నాలుగు అక్షరాలు( క్యాప్స్‌ లెటర్స్‌) మరియు మీ పుట్టిన సంవత్సరమే.

ఆధార్‌ కార్డుతో మొబైల్‌ నెంబర్‌ లేదా, మెయిల్‌ ఐడీ లింక్‌ కాకపోతే పరిస్థితి ఏంటి.. ఏముంది.. ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. దగ్గర్లో ఉన్న ఆధార్‌ కేంద్రానికి వెళ్తే వాళ్లే చేస్తారు.

 

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news