ఫారం 16 గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

-

ఫారం 16 అనేది సాదారణంగా ఇన్‌కమ్‌, ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌, ఇతర సమాచారం గురించి పేర్కొంటూ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసే ఒక సర్టిఫికేట్.ఇది ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ను మినహాయించినట్లు, ఉద్యోగి తరపున ప్రభుత్వ అధికారులకు డిపాజిట్ చేసినట్లు ధ్రువీకరిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ఇటీవల ఫారం 16లో ఉద్యోగులకు జారీ చేసిన వార్షిక జీతం TDS సర్టిఫికేట్‌లో సవరణలు చేసింది. అయితే కొత్త మార్పుల గురించి తెలుసుకునే ముందు.. ఫారం 16 గురించి వివరంగా తెలుసుకోవాలి.

ఫారం 16 అర్థం..

ఫారం 16 అంటే తమ ఆదాయపన్ను రిటర్న్‌ను సిద్ధం చేయడానికి, ఫైల్ చేయడానికి అవసరమైన సమాచారం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఆదాయం, పనిచేస్తున్న సంస్థ తీసివేసిన TDS మొత్తాన్ని చూపుతుంది.ఇందులో పార్ట్ ఎ మరియు పార్ట్ బి లు ఉంటాయి.

పార్ట్ ఎ..

త్రైమాసికంలో తీసివేసిన, డిపాజిట్ చేసిన TDS వివరాలు, పనిచేస్తున్న సంస్థ PAN, TAN వివరాలు, ఇతర సమాచారాన్ని అందిస్తుంది. యజమాని TRACES పోర్టల్ ద్వారా ఫారం 16లో ఈ భాగాన్ని రూపొందించారు..ఉద్యోగాలు మారే ఉద్యోగులు వేరే కంపెనీ లో పని చేసినప్పుడు ఈ ఫారం 16 తీసుకోవాలి.ఇందులో అన్నీ వివరాలు తప్పనిసరిగా ఉండాలి..ముఖ్యంగా వ్యక్తి చిరునామా, ఉద్యోగానికి సభంధించిన పూర్తీ వివరాలు..

పార్ట్ బి..

ఫారం 16 లో పార్ట్ ఎ కు పార్ట్ బి అనుబంధం ఉంది.ఆదాయపన్ను చట్టంలోని చాప్టర్ VI-A కింద ఆమోదం పొందిన జీతం, డిడక్షన్స్‌ను పేర్కొంటుంది.

పార్ట్ బి లోని కొన్ని అంశాలు..

జీతం వివరాలు..సెక్షన్ 10 కింద మినహాయింపు పొందిన అలవెన్సుల వివరణాత్మక విభజన, అధ్యాయం VI-A కింద తగ్గింపుల వివరాలు ఉంటాయి.

TDS అందించే ఉద్యోగి నివేదించిన ఇంటి ఆస్తి నుంచి ఆదాయం (లేదా అనుమతించదగిన నష్టం)

TDS అందించిన ‘ఇతర వనరుల’ ఆదాయం

ఇతర సంస్థల నుంచి పొందిన మొత్తం జీతం నివేదించడానికి కొత్త ఫీల్డ్

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ప్రామాణిక మినహాయింపు కోసం కొత్త ఫీల్డ్..

తాము చేస్తున్న ఉద్యొగాల నుంచి టీడీఎస్‌ చెల్లిస్తున్న వ్యక్తులు అందరూ అర్హులు.

ఆదాయపన్ను శాఖ అధికారిక

వెబ్‌సైట్‌ incometaxindia.gov.inను ఓపెన్‌ చేయాలి

ఫారంలు/డౌన్‌లోడ్’ విభాగంలోని ‘ఆదాయ పన్ను ఫారం’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

PDF లేదా పూరించదగిన ఫారమ్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయాలి

ఫారం డౌన్‌లోడ్ చేయడానికి ‘PDF’పై క్లిక్ చేయాలి..

ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యజమాని జీతం నుంచి TDSగా తీసివేసిన డబ్బును అధికారులకు సమర్పించినట్లు ఇది రుజువు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీరు చేసిన పెట్టుబడి ప్రకటనలు..

Read more RELATED
Recommended to you

Latest news