ఉగ్రవాదిని ఎక్కడ అరెస్ట్ చేసారో తెలుసా…? ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేసిన అధికారులు…!

-

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత విషయంలో భారత సైన్యం అక్కడి స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా సరే ఉగ్రవాదులను వదిలిపెట్టడం లేదు భారత బలగాలు. వారి గురించి జల్లెడ పడుతున్నాయి. నిఘా వర్గాల సమాచారం వస్తే చాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలించి వారు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. దీనితో ఉగ్రవాదులను ఎక్కడిక్కడ ఏరి వేసే కార్యక్రమం భారత బలగాలు చేస్తున్నాయి. కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉంటున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఆసుపత్రి నుంచి లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదిని ఈ రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర కాశ్మీర్‌లోని బండిపూర్ జిల్లాలోని హాజిన్ ప్రాంతంలో నివసిస్తున్న నిసార్ అహ్మద్ దార్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ నగరంలోని శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రి నుంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతను ఎల్‌ఇటి దుస్తులు ధరించి ఉన్నాడు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని సదరు అధికారి పేర్కొన్నాడు. అతని ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసారు. https://twitter.com/hussain_imtiyaz/status/1213305182685024259?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1213305182685024259&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Flashkar-terrorist-arrested-from-hospital-in-jammu-and-kashmir-srinagar-police-2158559

Read more RELATED
Recommended to you

Latest news