బెస్ట్ ఫిక్స్‌డ్ ప్లాన్ కోసం చూస్తున్నారా…? అయితే దీనిని చూడండి..!

-

మీరు ఎక్కువ డబ్బులని FD చేసి పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీని గురించి తెలుసుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరైన ఎంపికలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది. కనుక మంచి వాటిని సెలెక్ట్ చేసుకుని డబ్బు పెట్టాలి. అందుకే బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఈ మొత్తం విషయంలో ఫిక్స్ డ్ డిపాజిట్ మంచి , సులభమైన ఎంపిక, ఇది రిస్క్ ఫ్రీ అధిక రాబడులను పొందడంలో మీకు సహాయపడుతుంది.

money
money

దీని నుండి 6.75 శాతం వరకు రాబడిని పొందవచ్చు. పైగా ఎక్కువ డబ్బులు పెట్టక్కర్లేదు. మీరు నెలవారీ పెట్టుబడి ప్రారంభించవచ్చు , దానిపై వడ్డీని సంపాదించవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ప్రారంభంలో మీకు కనీస మొత్తం 5000 రూపాయలు మాత్రమే అవసరం. దీని తరువాత, మీరు ప్రతి నెలా బజాజ్ ఫైనాన్స్‌లో మీ FD ఖాతాలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఇలా ఉంటే సింగిల్ మెచ్యూరిటీ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకుంటే నిర్దేశిత రోజున రాబడులు పొందుతారు. ఇది సాధ్యం కావడానికి ప్రతి కొత్త డిపాజిట్ , గడువు మునుపటి డిపాజిట్ కంటే తక్కువగా ఉండాలి.

ఆన్‌లైన్‌లో సింపుల్ సింగిల్ మెచ్యూరిటీ ప్లాన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి రాబడిని లెక్కించవచ్చు , నిధుల విభజనను ఖచ్చితంగా తనిఖీ చేయవచ్చు. అలానే బజాజ్ ఫైనాన్స్ FD లపై పెట్టుబడిదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. బజాజ్ ఫైనాన్స్ FD పై ఆన్‌లైన్ లోన్ తీసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ సదుపాయంతో మీరు మీ FD విలువలో 75% వరకు రుణ మొత్తాన్ని పొందుతారు. లోన్ తీసుకున్న తర్వాత కూడా, మీ పెట్టుబడిపై వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news