పదేళ్లుగా అప్‌డేట్ చేయని ఆధార్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా?

-

పది ఏళ్లుగా అప్‌డేట్ చేసుకోని ఆధార్ కార్డులు జూన్ 14 తర్వాత డీయాక్టివేట్ అవుతాయని సోషల్ మీడియాలో పుకారు షికారు చేస్తోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని యూఐడీఏఐ స్పష్టం చేసింది. జూన్ 14 తర్వాత, ఆధార్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు. అదే వక్రీకరించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
పదేళ్లు దాటిన ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం చాలాసార్లు చెబుతూ వచ్చింది. గత 10 సంవత్సరాలుగా తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోని వారికి ఇది వర్తిస్తుంది. అలాంటి ఆధార్ కార్డు పదేళ్లుగా అప్ డేట్ కాకపోతే ఏమవుతుంది? తాజాగా అలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 14 తర్వాత అలాంటి ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తామని ఈ వైరల్ పోస్ట్‌లో రాసింది. అయితే ఆధార్ కార్డును రూపొందించిన యూఐడీఏఐ మాత్రం ఈ అంశాన్ని కొట్టిపారేసింది. 10 ఏళ్లుగా అప్‌డేట్ చేయని ఆధార్ కార్డు డీయాక్టివేట్ అవుతుందన్న వార్త సత్యదూరమని యూఐడీఏఐ తెలిపింది.

జూన్ 14 డెడ్‌లైన్ వార్త వెనుక రహస్యం ఏమిటి?

వాస్తవానికి ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం పలుమార్లు గడువును పొడిగించారు. కొత్త గడువు జూన్ 14, 2024. అప్పటి వరకు ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీన్ని కొందరు వక్రీకరించి పదేళ్లుగా అప్ డేట్ చేయని ఆధార్ కార్డు జూన్ 14 తర్వాత ఇన్ యాక్టివ్ అవుతుందని ప్రచారం చేసి ఉండొచ్చని అంటున్నారు.
ఇప్పుడు ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు అప్‌డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి కూడా వెళ్లవచ్చు. అయితే కొద్దిపాటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 14 తర్వాత కూడా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఉచితం కాదు. 50 లేదా అంతకంటే ఎక్కువ రుసుము చెల్లించాలి.
ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి?
UIDAI యొక్క స్వీయ-సేవ పోర్టల్ ssup.uidai.gov.in/ssup/ కి వెళ్లండి .
ఆధార్ నంబర్, OTP ఉపయోగించి లాగిన్ చేయండి
లాగిన్ అయిన తర్వాత ‘సర్వీసెస్’ ట్యాబ్ కింద ‘ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయి’ని ఎంచుకోండి.
‘ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్’పై క్లిక్ చేయండి.
ఆపై మీరు మార్చాలనుకుంటున్న వివరాలను ఎంచుకోండి.
ఆధార్ కార్డులో మీ పేరు కనిపిస్తుంది.
మీరు కోరుకున్న వివరాలను మార్చుకోవచ్చు. అదనపు పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
వివరాల మార్పు ధృవీకరించబడితే, అది నవీకరించబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news