హైదరాబాద్ నో కామన్ క్యాపిటల్ కాదు.. ఓన్లీ తెలంగాణ క్యాపిటల్ : హరీశ్ రావు

-

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం హరీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజధాని హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్ర జరుగుతోందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరో పదేళ్లు హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి హైదరాబాప్పై కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గతంలో హైదరాబాద్ పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారని.. అలాంటిది ఇప్పుడు మరో టెన్ ఇయర్స్ ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ ఇక కామన్ క్యాపిటల్ కాదని.. ఓన్లీ తెలంగాణ క్యాపిటల్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్లకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని.. అధికారమే ఆ రెండు పార్టీలకు ముఖ్యమని కానీ తెలంగాణతో కేసీఆర్ది పేగు బంధమని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని, కేవలం ఆరు నెలల్లోనే ఆ పార్టీ నిజరూపమేంటో బయటపడిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ను కాపాడుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news