ఇలాంటివి సెర్చ్ చేస్తున్నారా…? అయితే ప్రమాదకరమే..!

-

ఈ రోజుల్లో ఇంటర్నెట్ ని ఉపయోగించేవారు ఎక్కువయ్యారు. దీనితో పాటుగా ఆన్ లైన్ లో ఫ్రాడ్స్ వంటివి ఎక్కువ జరుగుతున్నాయి. గూగుల్ ద్వారా హ్యాకర్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇటువంటి మోసాలకి మనం కూడా బలైపోవాల్సి ఉంటుంది. అందుకని ఈ రోజు కొన్ని సర్చ్ చేయకపోతేనే మంచిదని చెప్తున్నాము. మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూడండి.

బ్యాంక్ ఇన్ఫర్మేషన్:

ఆన్లైన్ బ్యాంకింగ్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా కరోనా సమయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపే అందరూ మక్కువ చూపిస్తున్నారు. దీని కారణంగా చాలా లాభ నష్టాలు ఉన్నాయి. హ్యాకర్లు ఆన్లైన్లో బ్యాంకు తాలూకా URL లింకులు క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం ఎప్పుడైనా బ్యాంకు పేరు గూగుల్లో సెర్చ్ చేయగానే నెట్ లో మనం వాళ్లకి దొరికి పోతాము. దీనితో మన డబ్బులు వాళ్ళు దొంగిలిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా గూగుల్ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి మాత్రమే ఓపెన్ చేయండి.

కస్టమర్ కేర్ నెంబర్ ని వెతక వద్దు:

మనం ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాము. అయితే ఇలా కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. కంపెనీ తాలూకా ఫేక్ వెబ్సైట్ ని ఫ్రాడ్స్టర్స్ క్రియేట్ చేస్తారు. అలానే వాళ్ళ నెంబర్ మెయిల్ ఐడి పెడతారు. కాబట్టి గూగుల్ లో ఎప్పుడు కూడా ఏ కస్టమర్ కేర్ నెంబర్ ని మీరు వెతకొద్దు. కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్పుడు మాత్రమే మీరు నంబర్ ని తీసుకోండి లేదు అంటే తప్పక మోసగాళ్ళకి బలైపోవాల్సి ఉంటుంది.

గూగుల్ డాక్టర్ ని అనుసరించద్దు:

చాలా మంది గూగుల్ ని డాక్టర్ లాగా ట్రీట్ చేస్తారు. ఏవైనా లక్షణాలు ఉన్నా ఏమైనా సమస్యలు ఉన్నా గూగుల్లో వెతికి మందులు తీసుకుంటూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. గూగుల్ ద్వారా ఏ వెబ్సైట్ నుంచి మీరు మందులు తీసుకున్నా అది ప్రమాదకరం.

ప్రభుత్వ స్కీమ్స్:

మీరు ప్రభుత్వ స్కీమ్స్ కి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్ లోనే చూడండి. డిజిటల్ ఇండియా లో మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది. అయితే ప్రతి స్కీమ్ కూడా వాళ్ళ సొంత వెబ్సైట్ ఉంటుంది. దీని ద్వారా మీరు సమాచారాన్ని పొందవచ్చు. ప్రభుత్వ స్కీమ్స్ కి సంబంధించి ఫ్రాడ్స్టార్స్ ఫేక్ వెబ్ సైట్ ని క్రియేట్ చేస్తారు గుర్తించండి.

Read more RELATED
Recommended to you

Latest news