చెక్కు మీద సంతకం చేసేటప్పుడు.. ఈ పొరపాట్లు చెయ్యద్దు..!

-

చాలామంది చెక్కులని ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడైనా పేమెంట్ చేయాలంటే చెక్కు మీద అమౌంట్ రాసేసి సంతకం చేసి చెక్కుని ఇస్తూ ఉంటారు. మీరు కూడా చెక్ ని ఎక్కువగా వాడుతుంటారా..? చెక్ మీద సంతకం చేసేటప్పుడు ఈ తప్పులని అస్సలు చేయొద్దు ఇటువంటి తప్పుల్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. చెక్కు పై సంతకం చేసేటప్పుడు ఎక్కువ మంది ఇలాంటి పొరపాట్లనే చేస్తూ ఉంటారు.

చెక్కును జారీ చేసినప్పుడల్లా అమౌంట్ ని రాసేటపుడు చివర ఓన్లీ అని రాయండి. అయితే చాలామంది అమౌంట్ రాసిన తర్వాత ఓన్లీ అని రాయడం మర్చిపోతారు అమౌంట్ రాసిన తర్వాత అంత అమౌంట్ మాత్రమే అని మీరు రాసినట్లయితే ఎలాంటి మోసాలు కూడా జరగవు. ఖాళీ చెక్కు మీద ఎప్పుడు కూడా సంతకం చేయకండి. చెక్కు మీద అంతా రాసి సంతకం చేయండి.

సంతకం చేసేటప్పుడు బ్యాంకులో ఉన్న సంతకం చెక్కు మీద సంతకం ఒకేలా ఉండేలా చేయండి లేదంటే చెక్ బౌన్స్ అవుతుంది. తేదీ సరిగ్గా వేసేటట్టు చూసుకోండి. చెక్ బౌన్స్ అయితే జరిమానా తో పాటుగా జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది అలానే కొన్ని కారణాల వలన బ్యాంకు చెక్ ని తిరస్కరించినప్పుడు చెల్లింపు జరగని సందర్భాల్లో దానిని చెక్ బౌన్స్ అంటారు ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం, చెక్ ని జారీ చేసేటప్పుడు తగిన బ్యాలెన్స్ లేకపోవడం వలన ఇది కలుగుతుంది. దీన్ని పోస్ట్ డేటింగ్ చేయొద్దు ఎందుకంటే బ్యాంకు దానిని గౌరవించకపోవచ్చు. కాబట్టి చెక్కుని ఇచ్చేటప్పుడు సంతకం చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news