EPFO : పీఎఫ్ ఖాతాదారులకు ఝలక్…!

-

పీఎఫ్ అకౌంట్ ఉందా? ఇంకా పీఎఫ్ అకౌంట్‌లో ఈపీఎఫ్‌వో అందిస్తున్న వడ్డీ డబ్బులు మీ ఖాతా లో పడలేదా…? అయితే ఇది మీరు తప్పక తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలు ఇవే ఒక లుక్ వేసేయండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తన ఖాతాదారులకు వడ్డీ డబ్బులు చెల్లించింది. అయితే చాల మందికి ఇప్పటికే ఆ డబ్బులు పడ్డాయి. దీనిలో ఏ ఇబ్బంది లేదు.

అయితే కొంత మందికి మాత్రం ఇంకా ఈ వడ్డీ డబ్బులు రాలేదు. ఈ డబ్బులు అందుకోని వాళ్ళు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఎందుకు ఈ 40 లక్షల మందికి ఆ వడ్డీ డబ్బులు అందలేదు అనే విషయానికి వస్తే… కేవైసీ వివరాలు తప్పుగా ఉండటం మూలానే అని తెలుస్తోంది. ఒకవేళ మేరుకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీకు కూడా వడ్డీ డబ్బులు రాక పోతే మీరు ఒకసారి కేవైసీ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నాయోమో చూసుకోండి.

కాగా డిసెంబర్ 31 నాటికే పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ డబ్బులు చెల్లిస్తామని ఈపీఎఫ్‌వో గతం లోనే ప్రకటించింది. ఇది ఇలా ఉండగా 6 కోట్ల మంది పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఇప్పటికి ఇంకా 8 నుంచి 10 శాతం మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇంకా ఈ డబ్బులు అందలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news