టీజర్ టాక్: ఇంటి పేరుతో కామెడీ చేయనున్న షాదీ ముబారక్..

Join Our Community
follow manalokam on social media

దిల్ రాజు నిర్మాతగా షాదీ ముబారక్ పేరుతో చిన్న సినిమా తెరకెక్కింది. మొగలి రేకులు సీరియల్ హీరో సాగర్, నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఈ రోజే విడుదలైంది. దృశ్య రఘునాథ్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకునేలా ఉంది. పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి ఇంటి పేరు బాగుండాలని, ట్రెండీగా ఇంటి పేరుంటే బాగుంటుందని అనుకునే అమ్మాయికి, సున్నిపెంట మాధవ్ (సాగర్) పరిచయం అవుతాడు. తన ఇంటి పేరు పెద్దగా ఇష్టం లేని మాధవ్(సాగర్), హీరోయిన్ గొడవపడడం ఆసక్తిగా ఉంది.

మొత్తానికి కథంతా ఇంటి పేరు చుట్టే తిరుగుతున్నట్టుగా ఉంది. అందమైన ప్రేమకథతో పాటు చక్కటి హాస్యం అదనపు ఆకర్షణగా ఉండనుందని తెలుస్తుంది. సాగర్, ఇంతకుముందు కంటే బాగున్నాడు. పద్మశ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. రాహుల్ రామక్రిష్ణ ప్రత్యేక పాత్రలో మురిపించనున్నట్లు తెలుస్తుంది. మార్చ్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో షాదీ ముబారక్ సందడి చేయనుంది.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...