EPFO: ​​8.5% వడ్డీ ఉండడానికి గల కారణం ఇదే..!

-

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.5% గా ఉంచాలి అని చెప్పింది. ఈపీఎఫ్ ఖాతాదారులు కి ఈ 2020- 21 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గురువారం జరిగిన ఈపీఎఫ్ఓ central board of trustees సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో అయితే ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీ చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే 2020- 21 ఆర్థిక సంవత్సరం లో కూడా ఇదే రేటు ప్రకారం వడ్డీ ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ ఆర్థిక సంవత్సరం కూడా 8.50 శాతం లభిస్తుంది. అయితే ఇది ఎప్పుడు అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.50 ఉంది. 2013-14, 2014-15 వ ఆర్థిక సంవత్సరం లో అయితే 8.75 శాతం ఉంది. వాస్తవానికి ఈ సారి వడ్డీ రేటు తగ్గొచ్చని వార్తలు వినిపించాయి. కానీ వడ్డీ రేటు లో ఎటువంటి మార్పు చేయలేదు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ రేటును తగ్గించాలని అనుకుని నిర్లక్ష్యం చేస్తోంది. ఇతర పొదుపు సాధనలో ఈపీఎఫ్ఓ రేటు అత్యధికంగా కొనసాగుతోంది. స్మాల్ సేవింగ్ రేట్లు అయితే 4.0 పర్సెంట్ నుండి 7.6 శాతం వరకు ఉన్నాయి. పైగా ఇవి జనవరి నుండి మార్చి త్రైమాసికం లో మార్పులు చేయడం కూడా జరగదు. ఇది ఇలా ఉండగా ఫినాల్స్ మినిస్ట్రీ ప్రశ్నించింది…? అదేమిటంటే 2019- 20 ఇంట్రెస్ట్ రేటు మరియు 2018-219 ఇంట్రెస్ట్ రేటు 8.6 శాతం ఉంది కదా ఒకేలాంటి రిస్క్ వచ్చింది కదా అని IL&FS ని అడిగింది.

గత మార్చి నెల లో 2019 20 సంవత్సరానికి 8.5% ఉంచింది. సెప్టెంబర్ లో CBT 2 భాగాలు చేసింది. కరోనా వైరస్ కారణంగా ఈ అసాధారణమైన పరిస్థితులు వచ్చాయి అని చెప్పింది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీ ఒకేసారి క్రెడిట్ చేసింది. తర్వాత రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎక్కువ విత్ డ్రాలు మరియు తక్కువ కాంట్రిబ్యూషన్ కారణంగా ముందస్తు సౌకర్యం కింద రూ. 14,310.21 కోట్లు ఇచ్చింది. 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో మొత్తం రూ. 197.91 లక్షల తుది పరిష్కారం, మరణం, భీమా మరియు ముందస్తు క్లెయిమ్‌లు 73,288 కోట్లు పరిష్కరించబడ్డాయి.

అలానే తమ సొంత పిఎఫ్ ట్రస్టులను నడుపుతున్న మినహాయింపు సంస్థలు రూ. 4.19 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించాయి. రూ. 3,983 కోట్ల రూపాయలు పంపిణీ చేశాయి. ఈ ఆర్ధిక సంవత్సరం కి గాను వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించాక కార్మిక మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news