మాట్లాడుతూ చాట్ చేసుకోవడమేందో అర్థం కాలేదా? కాస్త వివరంగా తెలుసుకుందాం.. టెన్షన్ పడకండి. ఫేస్‌బుక్ అంటే మీకు తెలుసు.. ఫేస్ బుక్ మెసెంజర్ అంటే కూడా తెలుసు. మెసెంజర్‌లో చాట్ చేసుకుంటారు. వాయిస్ కాల్, వీడియో కాల్ మాట్లాడుతారు.. అంతే కదా. కానీ.. ఇప్పుడొచ్చే ఫీచర్ ఏందంటే.. మీరు మాట్లాడుతారు.. అంతే మీరు మాట్లాడిన దాన్ని అచ్చు గుద్దినట్టు టైప్ చేసి ఫేస్‌బుకే అవతలి వ్యక్తికి పంపిస్తుంది. అంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక. దాన్నే వాయిస్ కమాండ్ అని అంటారు. చాలా ప్లాట్‌ఫాంలో ఈ ఫీచర్ ఇదివరకే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్ కూడా ఈ ఫీచర్ కోసం అంతర్గతంగా టెస్టులు నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ వల్ల చేతితో ఫోన్‌ను ముట్టుకోకుండా చాట్ చేసుకోవచ్చు.. వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. రిమైండర్స్ సెట్ చేసుకోవచ్చన్నమాట. ఈ ఫీచర్ ఓకే అయితే మెసెంజర్‌లో ప్రతి నెలా యాక్టివ్‌గా ఉండే 1.3 బిలియన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో రానుంది. అంటే.. 130 కోట్ల మంది.. అది సంగతి.
ఫేస్‌బుక్‌లో మరో ఫీచర్.. మాట్లాడుతూ చాట్ చేసుకోవచ్చు..!
By Anil Kumar
-
Previous article
Next article