ఫేస్‌బుక్‌తో జతకట్టిన స్పాటిఫై!

-

ఇక ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫాంపైనే మీకు నచ్చిన పాటలు విని మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేసే అవకాశం లభించనుంది. ఫేస్‌బుక్, మ్యూజిక్‌ ప్లేయర్‌ స్పాటిఫైతో జతకట్టడంతో ఈ సౌలభ్యం దక్కనుంచి. ఇక మీరు పాటలు వినడానికి ఫేస్‌బుక్‌ యాప్‌ను క్లోస్‌ చేయకుండానే మ్యూజిక్‌ను వినొచ్చు. ఇకపై ఫేస్‌బుక్‌ యాప్‌లోనే స్పాటిఫై ఆప్షన్‌ కనబడనుంది, దీంతో మ్యూజిక్‌ ప్లేచేసుకోవచ్చు, పాడ్‌క్యాస్ట్‌లు కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా స్పాటిఫై ద్వారా ఫేస్‌బుక్‌లో ఆడియో కంటెంట్‌ను మీకు నచ్చినవారికి షేర్‌ కూడా చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ ఈ సరికొత్త ఫీచర్‌తో పాటలను పూర్తిగా వినొచ్చు.

 

అయితే, ఇప్పటి నుంచి ఫేస్‌బుక్‌ పోస్టులను చదువుతూ స్క్రీన్‌ స్క్రోల్‌ చే స్తూనే మీకు నచ్చిన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. మరి ఈ కొత్త ఫీచర్‌ ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అమెరికాతో పాటు మరో 27 మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. రానున్న రోజుల్లో మరింత విస్త్రతం చేయనుంది. సాధారణంగా మనం బ్యాగ్రౌండ్‌లో మ్యూజిక్‌ ప్లే అయ్యే షేరింగ్‌ వీడియోలను చూశాం. వాటిలో ప్లే బటన్‌ వీడియో పూర్తయిన తర్వాతనే కనిపిస్తుంది. అప్పుడు పాటను ప్లే చేయగలుగుతాం. కానీ, ఫేస్‌బుక్‌ నయా ఫీచర్‌లో కంటిన్యూగా షఫ్లింగ్‌ పద్ధతిలో మ్యూజిక్‌ ప్లే అవుతూనే ఉంటుంది. మీకు ఓపిక ఉంటే యాడ్‌లు కూడా వినోచ్చు. స్పాటిఫై ద్వారా డైరక్ట్‌గా యాడ్‌ ప్లే అవుతుంది.

ఫేస్‌బుక్‌ ఉపయోగించినా లిమిటెడ్‌ డేటానే అవసరమవుతుంది. కాబట్టి వినియోగదారులు కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఉత్సాహాం చూపిస్తారు. యాడ్‌ల కోసం ఈ ఫీచర్‌ను తీసుకురాలేదని, పాటలు వినేవారు డేటా షేర్‌ చేసే ముందు అవతలి వ్యక్తి అంగీకారం కూడా ఉండాలి అని స్పాటిఫైకి సంబంధించిన అధికారులు తెలిపారు. 2019 లోనే ఈ రెండు సంస్థలు డీల్‌ కుదుర్చుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news