కరోనా నేపథ్యంలో వారి ఖాతాలోకి ఐదు వేల రూపాయలు…!

కరోనా మహమ్మారి అందరిని ఇబ్బందుల లోకి తీసుకు వచ్చేసింది. రోజు రోజుకి చూస్తుంటే కేసులు కూడా తీవ్రంగా పెరిగి పోతున్నాయి. జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉండడం మంచిది. ఈ సెకండ్ వేవ్ చాల మందిని బాలి తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే కోవిడ్ 19 దెబ్బకి పలు రాష్ట్రాలు మళ్లీ పాక్షిక లాక్ డౌన్ విధించడం కూడా చూస్తున్నాం.

 

cash
cash

వీటిలో ఢిల్లీ కూడా ఉంది. పరిస్థితి తీవ్రంగా ఉండడం తో ఢిల్లీ లాక్ డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించడం జరిగింది. ఒక పక్క బయట ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది. ఔషధాలు కూడా అందరికీ అందుబాటులో లేవు. అయితే ఇటువంటి పరిస్థితి లో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కష్ట కాలం లో కార్మికులకు రూ.5 వేలు అందిస్తోంది. వారి బ్యాంక్ అకౌంట్లలోనే ఈ డబ్బులను నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. దీంతో కార్మికులకు కాస్త ఊరట కలుగనుంది. ఇప్పటి వరకు సగం మందికి డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో మిగిలిన వారందరికీ కూడా రూ.5 వేలు లభించనున్నాయి.

ఈ డబ్బులు ఎవరికీ వస్తాయి అనేది చూస్తే… కేవలం లేబర్ బోర్డు లో రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ డబ్బులు లభిస్తాయి. మరో 2 నుంచి 3 రోజుల్లో కన్‌స్ట్రక్షన్ వర్కర్ల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనుంది. స్కూల్స్, కన్‌స్ట్రక్చన్ సైట్లలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.