వెంటిలేటర్ మీద సబ్బం హరి.. వైద్యులతో మాట్లాడిన చంద్రబాబు !

-

అనకాపల్లి మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయనకు పది రోజుల క్రితం కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా సహా ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారని సమాచారం. సబ్బం హరి ఆరోగ్యం గురించి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

అలాగే హరి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన సబ్బం హరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు, అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. . ప్రస్తుతం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. ఆయన విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్న కనకదుర్గ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా అదే హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. ఈనెల 15న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు మొదటి మూడు రోజులు హోం ఐసోలేషన్ లోనే ఉన్నా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనని హాస్పిటల్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news