ముఖేష్ ధీరూభాయ్ అంబానీ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రస్తుతానికి దేశంలోనే అత్యంత ధనవంతుడైన కుబేరుడిగా ఉన్నారు. అయితే ప్రముఖ మ్యగజీన్ ఫోర్బ్‌స్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి కూడా ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 51.4 బిలియన్ డాలర్లని తేలింది. జియో టెలికాం ద్వారా ముఖేష్ తన ఆస్తులను ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు పెంచుకోవడం గమనార్హం.
ఇక వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగుపర్చుకొని రెండో స్థానానికి చేరడం విశేషం. ఆయన ఆస్తుల విలువ 15.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక అంబానీ అదానీల తర్వాత అశోక్‌లేలాండ్ అధినేతలు, హిందూజా సోదరులు, షాపూర్‌జీ పల్లోన్‌జీ గ్రూపునకు చెందిన పల్లోన్‌జీ మిస్త్రీ, కోటాక్ మహేంద్ర బ్యాంకు అధినేత ఉదయ్ కొటాక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీకి చెందిన శివ్ నాడార్‌లు వరసగా నిలిచారు. ఇక జాబితాలో నిలిచిన అత్యంత ధనికుల ఆస్తులు ఓవరాల్‌గా 8శాతంకు పడిపోయినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.