అన్నదాతలకు సూపర్ స్కీమ్… వివరాలు ఇవే..!

-

రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్‌ తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఈ పథకం లో చేరిన రైతులకు నేరుగా డబ్బులు బ్యాంక్ అకౌంట్ల లో పడడం వలన బెనిఫిట్ కలిగింది. అయితే ఈ రూ.6 వేలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల కి అందుతున్నాయి. ఇలా ఒక్కోసారి రూ.2 వేలు రైతుల బ్యాంక్ అకౌంట్ల లోకి వస్తాయి. ఇప్పుడు మరో బెనిఫిట్ కూడా అందుతుంది. ఈసారి పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా కూడా రైతులు డబ్బులని పొందొచ్చు.

ఈ కిసాన్ మాన్ ధన్ యోజన అనేది పెన్షన్ స్కీమ్. రైతులు ఇందులో చేరడం వలన లాభం కలుగుతుంది. రైతులకు 60 ఏళ్లు వయసు దాటిన తర్వాత నెలకు రూ.3 వేలు లభిస్తాయి. అయితే ఇందులో ఎవరు చేరచ్చు అనే విషయానికి వస్తే.. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌ లో చేరొచ్చు. ఇందులో చేరితే రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 21 లక్షల మంది రైతులు ఈ స్కీమ్‌లో చేరడం జరిగింది.

ఆధార్ కార్డు, పొలం పాస్‌బుక్, రెండు ఫోటోలు తీసుకుని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చేరొచ్చు. అదే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్న వారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితం గానే ఇందులో చేరొచ్చు. పీఎం కిసాన్ డబ్బుల నుంచే నేరుగా పీఎం కిసాన్ మాన్ ధన్ కంట్రిబ్యూషన్ చెల్లించొచ్చు. https://maandhan.in/auth/login వెబ్‌సైట్ ద్వారా మీరు నేరుగా ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news