భార‌త రాజ్యాంగం క‌ల్పించిన ముఖ్య‌మైన హ‌క్కులు.. తెలుసుకోండి..!

-

మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం. అంటే.. మ‌న దేశంలో మ‌న‌ల్ని పాలించే ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను మ‌న‌మే ఎన్నుకుంటాం అన్న‌మాట‌. ప్ర‌పంచంలో మ‌రే దేశంలో లేని భిన్న‌త్వంలో ఏక‌త్వం కూడా మ‌న దేశంలో ఉంది. ఇక్క‌డ అనేక జాతులు, వ‌ర్గాలు, కులాలు, మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఆయా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. indian constitution

indian constitution rights
indian constitution rights

 అయిన‌ప్ప‌టికీ వారంత క‌ల‌సి మెల‌సి సోద‌ర భావంతో జీవిస్తున్నారు. ఇక మ‌న రాజ్యాంగం indian constitution కూడా మ‌నం స్వేచ్ఛ‌గా జీవించ‌డానికి ప‌లు హ‌క్కుల‌ను మ‌న‌కు క‌ల్పించింది. భార‌తీయులుగా పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి ఈ హ‌క్కులు వ‌ర్తిస్తాయి. మ‌రి రాజ్యాంగం మ‌న‌కు క‌ల్పించిన ఆ హ‌క్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

భార‌త రాజ్యాంగం క‌ల్పించిన ముఖ్య‌మైన హ‌క్కులు

1. మాట్లాడే హ‌క్కు

భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(1)(ఎ) ప్ర‌కారం మ‌న‌కు మ‌న భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచే హ‌క్కు ఉంది. మ‌న భావాల‌ను మ‌నం ఏ రూపంలోనైనా స్వేచ్ఛ‌గా వెల్ల‌డించ‌వ‌చ్చు. అలాగే ఏ విష‌యంపైనైనా స‌రే.. స్వేచ్ఛ‌గా మాట్లాడే హ‌క్కును కూడా రాజ్యాంగం మ‌న‌కు అందించింది. అంటే.. మ‌న అభిప్రాయాల‌ను మ‌నం స్వేచ్ఛ‌గా వెల్ల‌డించేట‌ప్పుడు ఎవ‌రూ అడ్డు చెప్ప‌కూడ‌ద‌న్న‌మాట‌.

2. ఫ్రీడం ఆఫ్ ప్రెస్

ఫ్రీడం ఆఫ్ ప్రెస్ అంటే.. కేవ‌లం మీడియా చాన‌ల్స్‌, వార్తా ప‌త్రిక‌ల‌కే కాదు, సాధారణ పౌరుల‌కు కూడా ఈ హ‌క్కు ఉంటుంది. దీని వ‌ల్ల జ‌ర్న‌లిస్టులు, సాధార‌ణ పౌరులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్త ప‌ర‌చ‌వ‌చ్చు. దాన్ని ఎవ‌రూ అడ్డుకోరాదు. అవినీతి ప‌రులు, అన్యాయాల గురించి ప‌త్రిక‌లు రాసే హక్కు ఉంటుంది. అలాగే సామాన్య పౌరులు కూడా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆయా అంశాల‌పై నిల‌దీయ‌వ‌చ్చు. ఆ సంద‌ర్భంలో వారిని ఎవ‌రూ అడ్డుకోరాదు.

3. రైట్ టు చాయిస్ ఆఫ్ ఫుడ్

భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం.. మ‌న దేశంలోని ఏ పౌరుడు అయినా స‌రే.. త‌న‌కు ఇష్ట‌మైన ఆహారాన్ని తినే హ‌క్కు ఉంటుంది. నువ్వు ఫ‌లానా ఆహారం మాత్ర‌మే తినాలి.. అని శాసించే అధికారం ఎవ‌రికీ లేదు. ఎవ‌రికి న‌చ్చిన ఫుడ్‌ను వారు తిన‌వ‌చ్చు. దాన్ని ఎవ‌రూ అడ్డుకోరాదు.

4. రైట్ టు లివ్ విత్ హ్యూమ‌న్ డిగ్నిటీ

భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21, ఆర్టిక‌ల్ 39, 41, 42 ల‌లో ఉన్న నిర్దిష్ట‌మైన క్లాజుల‌లో రైట్ టు లివ్ విత్ హ్యూమ‌న్ డిగ్నిటీకి సంబంధించిన అంశాల‌ను పొందు ప‌రిచారు. దాని ప్ర‌కారం.. ప్ర‌తి భార‌తీయుడికి స‌మాజంలో గౌర‌వ ప్ర‌దంగా జీవించే హ‌క్కు ఉంటుంది. అందువ‌ల్ల ఎవ‌రూ ఎవ‌ర్నీ అగౌర‌వ పరిచే విధంగా ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. అది వృత్తి ప‌రంగాకానీ, మ‌రే ఇత‌ర అంశం ప‌రంగా అయినా కానీ.. ఎవ‌రూ ఎవ‌ర్నీ అగౌర‌వ ప‌ర‌చ‌రాదు.

5. రైట్ ఎగెనెస్ట్ సెక్సువ‌ల్ హ‌రాస్‌మెంట్ ఎట్ వర్క్ ప్లేస్

భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం.. ప‌నిచేసే ప్ర‌దేశాల్లో ఆడ లేదా మ‌గ ఎవ‌రైనా స‌రే.. ఒక‌రిపై ఒక‌రు లింగ వివ‌క్ష చూపించ‌రాదు. అలాగే ఇత‌రుల‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేయ‌రాదు. వ‌ర్క్ ప్లేస్‌ల‌లో లైంగిక వేధింపుల‌కు, లింగ వివ‌క్షకు గురి కాకుండా స్వేచ్ఛగా ప‌నిచేసుకునే హ‌క్కు భార‌తీయుల‌కు ఉంది. దాన్ని ఎవరూ అడ్డుకోరాదు.

6. రైట్ టు మెడిక‌ల్ కేర్

దేశంలో నివ‌సిస్తున్న ప్ర‌తి భార‌తీయుడికి నాణ్య‌మైన వైద్యం పొందే హ‌క్కు ఉంది. ప్ర‌భుత్వ లేదా ప్రైవేటు ఆసుప‌త్రులు ఎక్క‌డికి వెళ్లినా స‌రే.. వైద్యులు పేషెంట్ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించాలి. నాణ్య‌మైన వైద్య సేవ‌లను పొందే హ‌క్కు ప్ర‌తి భార‌తీయుడికి ఉంది.

7. రైట్ టు గెట్ పొల్యూష‌న్ ఫ్రీ వాట‌ర్ అండ్ ఎయిర్

భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21, 32ల ప్ర‌కారం.. ప్ర‌తి భార‌తీయుడికి నాణ్య‌మైన తాగునీరు, కాలుష్యం లేని గాలిని పొందే హ‌క్కు ఉంది.

8. రైట్ ఎగెనెస్ట్ నాయిస్ పొల్యూష‌న్

దేశంలో నివ‌సించే ప్ర‌తి భార‌తీయుడికి శ‌బ్ద కాలుష్యం లేని ప్రాంతాల్లో నివాసం ఉండే హ‌క్కు ఉంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రూ కూడా ఇత‌రుల ప్ర‌శాంత‌త‌కు భంగం క‌లిగించేలా పెద్ద పెద్ద శ‌బ్దాలు చేయ‌కూడ‌దు. ఇత‌రుల ప్ర‌శాంత‌మైన జీవ‌నానికి శ‌బ్దాల‌తో భంగం క‌లిగించ‌రాదు.

9. రైట్ టు ప్రైవ‌సీ

భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం.. మ‌న దేశంలో నివసించే ప్ర‌తి వ్య‌క్తికి త‌న సమాచారాన్ని ఇత‌రుల బారిన ప‌డ‌కుండా గోప్యంగా దాచుకునే హ‌క్కు క‌ల్పించారు. అందువ‌ల్ల ఎవ‌రూ ఎవ‌రి వ్య‌క్తిగ‌త స‌మాచారం లేదా ఇత‌ర వివ‌రాల‌ను దొంగిలించ‌రాదు. ఎలాగైనా స‌రే స‌మాచారాన్ని సేక‌రించినా, దొంగిలించినా అది పౌరుల హ‌క్కుల‌కు భంగం క‌లిగించిన‌ట్లే అవుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news